ETV Bharat / state

పెట్టుబడులకు హైదరాబాద్ దివ్య ఔషధం: మంత్రి కేటీఆర్ - forma news in hyderabad

బయో ఆసియా 17 ఎడిషన్ సదస్సు హైదరాబాద్​లో అట్టహాసంగా కొనసాగుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో పాటు.. పలు ఫార్మా కంపెనీల సీఈవోలు, లైఫ్ సైన్సెస్ ప్రముఖులు, 37 దేశాల నుంచి 2 వేల వరకు ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో భాగంగా ఏటా బయోఆసియా తరఫున ఇచ్చే జీనోం వాలీ ఎక్సలెన్సీ అవార్డును పెన్సిల్వేనియాకు చెందిన డాక్టర్ కార్ల్​జోన్స్​కు అందజేశారు. ఇవాళ జరిగే సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు.

bio asia summit 2020
బయో ఆసియా సదస్సు
author img

By

Published : Feb 18, 2020, 9:20 AM IST

Updated : Feb 18, 2020, 11:33 AM IST

పెట్టుబడులకు హైదరాబాద్ దివ్య ఔషధం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ హెచ్ఐసీసీలో లైఫ్ సైన్సెస్ రంగంలో ఏటా నిర్వహించే బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్​, నోవార్టిస్ వంటి పలు ప్రముఖ ఫార్మా కంపెనీల సీఈవోలు, లైఫ్ సైన్సెస్ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. స్విట్జర్లాండ్ ఈ సదస్సుకు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

బయో ఆసియా సదస్సులో భాగంగా ఏటా ఇచ్చే జీనోం వాలీ ఎక్సలెన్సీ అవార్డును యూఎస్ఏకు చెందిన పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్​జోన్స్​కు అందజేశారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్​తో హైదరాబాద్ వైబ్రంట్ లైఫ్​సైన్సెస్ ఎకోసిస్టం ఎంవోయూ కుదుర్చుకున్నారు. బయోకాన్ పరిశోధక కేంద్రమైన సింజన్ హైదరాబాద్ ఫెసిలిటీని ఈ సదస్సులో ఆవిష్కరించారు. హైదరాబాద్​ ఫార్మా ప్రగతిని మంత్రి కేటీఆర్​ గుర్తు చేశారు.

లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ కాపిటల్​గా ఎదుగుతోందని పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో సింహ భాగం మందులు, పేరెన్నికగన్న వ్యాక్సిన్ ఉత్పత్తులు హైదరాబాద్ నుంచి ఉత్పత్తి జరగటం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే మెడికల్ డివైస్ పార్క్​లో ఫార్మా కంపెనీలు పని ప్రారంభించామని వెల్లడించారు.

దేశ ఆరోగ్య రంగం ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లను ట్రాన్సఫర్మేటివ్​, బ్రేక్​త్రూ టెక్నాలజీలు పరిష్కారాలు చూపుతాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్​ రంజన్​ అన్నారు. లైఫ్​ సైన్సెస్​ రంగంలో స్టార్టప్​లకు తమ ఉత్పత్తులను, మేథో సంపత్తి ప్రదర్శించడానికి ఇదో చక్కని వేదికని అన్నారు. లైఫ్ సైన్సెస్​కు అతిపెద్ద క్లస్టర్​గా జీనోం వ్యాలీ నిలుస్తోందని.. దాని విస్తరణకు మాస్టర్ ప్లాన్​తో ముందుకెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు.

ఇదీ చూడండి: నగర స్వరూపం మార్పే లక్ష్యంగా.. పురపాలక సదస్సు

Last Updated : Feb 18, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.