ETV Bharat / state

బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 317 జీఓ ఉపాధ్యాయులకూ అవకాశం

author img

By

Published : Feb 7, 2023, 4:49 PM IST

Updated : Feb 8, 2023, 7:51 AM IST

ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

16:44 February 07

12 నుంచి బదిలీ దరఖాస్తులకు వెసులుబాటు

Teacher Transfers in Telangana: ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. G.O 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, లాంగ్వేజి పండిట్లను బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. కనీసం ఒకేచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇటీవల ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు 317 G.O ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి లేదు. దీంతో.. తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు వారి అభ్యర్థనను పరిశీలించి.. ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25వేల మంది ఉన్నందున ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా.. ఉమ్మడి జిల్లాలోని సర్వీసు పాయింట్లను కూడా జత చేసి, వాటి ఆధారంగా బదిలీలకు సంబంధించి అనుమతివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులపై ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి బదిలీ అయిన 25 వేల మందిలో దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో సర్వీసు కలిపి రెండేళ్లు పూర్తయిన వారికి కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతివ్వాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 59 వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన కూడా పూర్తయిందని, ఈ ధరఖాస్తులు కూడా వచ్చిన తర్వాత అన్నింటిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఇదీ 37 రోజుల కాలపట్టిక..

  • జనవరి 27న: అన్ని కేటగిరీల ఖాళీలు, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటించడం
  • జనవరి 28-30: బదిలీల కోసం అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం
  • జనవరి 31-ఫిబ్రవరి 2: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు పైఅధికారుల ధ్రువీకరణతో హార్డ్‌ కాపీలను సమర్పించడం
  • ఫిబ్రవరి 7వ తేదీ: డీఈవో, ఆర్‌జేడీ వెబ్‌సైట్లో బదిలీ పాయింట్లతో కూడిన తాత్కాలిక సీనియారిటీ జాబితా, పదోన్నతులకు సీనియారిటీ జాబితా ప్రకటన.
  • ఫిబ్రవరి 8-10: అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం.
  • ఫిబ్రవరి 11-12: బదిలీలు, పదోన్నతులకు తుది సీనియారిటీ జాబితా ప్రకటన. హెచ్‌ఎంలు బదిలీల కోసం వెబ్‌ ఆప్షన్ల నమోదు.
  • 14వ తేదీ: ఆర్‌జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల జారీ.

స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు, బదిలీల అంకం ఇలా...

  • 15వ తేదీ: హెచ్‌ఎంల బదిలీల అనంతరం మిగిలిన ప్రధానోపాధ్యాయ ఖాళీల ప్రకటన.
  • 16-18 వరకు: అర్హత కలిగిన స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్‌.
  • 19, 20 తేదీలు: సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీల ఆప్షన్ల నమోదు
  • 21వ తేదీ: ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం.
  • 22, 23 తేదీలు: డీఈఓలచే స్కూల్‌ అసిసెంట్ల బదిలీ ఉత్తర్వుల జారీ

సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు, బదిలీలు..

  • 24వ తేదీ: స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన.
  • 25-27 వరకు: ఎస్‌జీటీ, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టుల్లో మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు.
  • ఫిబ్రవరి 28- మార్చి 2వ తేదీ వరకు: ఎస్‌జీటీ, తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్‌ ఆప్షన్ల నమోదు.
  • మార్చి 3వ తేదీ: ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన.
  • 4వ తేదీ: ఎస్‌జీటీ, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.
  • మార్చి 5-19వ తేదీ వరకు: డీఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్‌జేడీకి.. ఆర్‌జేడీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపుకోవాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.

ఇవీ చూడండి..

ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల

Last Updated : Feb 8, 2023, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.