ETV Bharat / state

చివరి కిలో పత్తి వరకూ ప్రభుత్వమే కొంటుంది: కిషన్​ రెడ్డి - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

పత్తి సేకరణపై కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్ముకోవాలని సూచించారు.

చివరి కిలో పత్తి వరకూ ప్రభుత్వమే కొంటుంది: కిషన్​రెడ్డి
author img

By

Published : Nov 2, 2019, 6:10 PM IST

రాష్ట్రంలో చివరి కిలో పత్తి పంట వరకు కొనుగోలు చేయడానికి సీసీఐ, మార్కెటింగ్ శాఖ సిద్ధంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. మధ్య దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​లోని సోమాజిగూడ దిల్‌కుశ అతిథి గృహంలో పత్తి సేకరణపై భారత పత్తి సంస్థ, మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌ మొదలైన తరుణంలో పత్తి రాకను దృష్టిలో ఉంచుకొని సీసీఐ, మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లపై ఆయన చర్చించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్ల పరిధిలో 107 సీసీఐ కేంద్రాలు సహా నోటిఫై చేసిన వ్యవసాయ మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. వర్షాలకు తడిసిన పంటను ఆరబెట్టుకుని 12 శాతం లోపు తేమ గల సరకు మార్కెట్‌కు తీసుకొస్తే మంచి ధర లభిస్తుందనే అంశాన్ని రైతుల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కర్షకులకు ఇబ్బందులు తలెత్తకుండా సీసీఐ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నందున అన్నదాతలు ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీసీఐ సీఈఓ పాణిగ్రాహి, జనరల్ మేనేజర్ అతుల్‌బాలా, మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్, భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్‌ రెడ్డి, సీసీఐ వరంగల్, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్ ప్రాంతీయ మేనేజర్లు పాల్గొన్నారు.

చివరి కిలో పత్తి వరకూ ప్రభుత్వమే కొంటుంది: కిషన్​రెడ్డి

ఇవీ చూడండి: రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.