ఈసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. తొలి ధపాలో 83.56 శాతం సీట్లు కేటాయించారు. ఈ ఏడాది 24 వేల 506 మంది ఈసెట్‌కు అర్హత సాధించగా వారిలో 16వేల 464 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలో ఈసెట్‌లో 10 వేల 124 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 8 వేల 460 భర్తీ అయ్యాయి. మరో 1664 సీట్లు మిగిలాయి. ఇంజినీరింగ్‌లో 9 వేల 119 సీట్లు ఉండగా... 8వేల 396 భర్తీకాగా.. 723 మిగిలాయి. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో కేవలం 32 మాత్రమే మిగిలాయి. ఫార్మా కోర్సులకు స్పందన కరువైంది. మొత్తం 1005 సీట్లు ఉండగా కేవలం 64 మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు జులై 4 వరకు ఆన్ లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 15-20 శాతం పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు