2018 మార్చిలో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. ఆంధ్ర మహిళా సభ ఎదురుగా నాలుగు కోట్ల 16 లక్షల రూపాయల వ్యయంతో నియోజకవర్గం మొత్తం సీసీ రోడ్లు వేయడానికిగాను శంకుస్థాపన చేశారు. కానీ 16 నెలలు గడిచినా నేటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు, అభివృద్ధి పనులు చేపట్టలేదు.
శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజలకు మాయ మాటల చెప్పి ఓట్లు దండుకోవాలని నామమాత్రంగా శంకుస్థాపన చేశారు తప్ప మరిది లేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేయాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెరాస నేతలు ప్రజలను మభ్య పెట్టే మాటలు మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు'