ETV Bharat / state

ఆ వైద్యుడు... వృథా జలాలకు చికిత్స చేస్తున్నాడు - waste water

నీటి వృథాను అరికట్టడంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడో వైద్యుడు. తన ఆసుపత్రిలో సీవేజ్ ట్రీట్​మెంటు ప్లాంటును ఏర్పాటు చేసి వృథా జలాలతో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. భూగర్భ జలాలలను సక్రమంగా వినియోగించుకుంటూ నీటి కొరత రాకుండా చూసుకుంటున్నారు.

ఆ వైద్యుడు... వృథా జలాలకు చికిత్స చేస్తున్నాడు
author img

By

Published : Aug 24, 2019, 1:08 PM IST

ఆ వైద్యుడు... వృథా జలాలకు చికిత్స చేస్తున్నాడు

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రోజూ కొన్ని వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. పైగా ఆ వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలితే భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. పైగా ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లే వృథానీరు మరింత ప్రమాదకరం. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మహాత్మగాంధీ ఆస్పత్రి నిర్వాహకులు తమ ఆస్పత్రిలో మురుగునీటిని శుద్ధి చేసే సీవేజ్ ట్రీట్ మెంటు ప్లాంటును ఏర్పాటు చేశారు.

స్వతహాగా మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి.... తనే ముందడుగు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వ్యయ, ప్రయాసలను పక్కన పెట్టి 40 వేల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి వ్యవస్థను నిర్మించారు. మహాత్మగాంధీ ఆస్పత్రిలో వివిధ విభాగాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు ప్లాంటుకు చేరేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ శుద్ధి జరిగిన తర్వాత మొక్కలకు పెడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో నాలుగు దశల్లో నీటి వృథాను అరికట్టేందుకు ఈ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందుకోసం ఏడు మోటార్లు అమర్చి వ్యర్థజలాల్లో బ్యాక్టీరియాను తొలగించేలా ఐదు రకాల ద్రావణాలను వినియోగిస్తున్నారు.

శుద్ధిచేసిన నీరు నిల్వ చేసేందుకు ఆస్పత్రి పైభాగంలో ప్రత్యేకంగా ట్యాంకు నిర్మించారు. ఈ నీటి వినియోగంతో ఆస్పత్రి ప్రాంగణమంతా పచ్చటి అందాలతో అలరారుతోంది. ఆస్పత్రిలో వృథా జల సంరక్షణ చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు సైతం మెరుగ్గా ఉంటున్నాయని... ఏడాది పొడవునా ఎవరిపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించామని వైద్యులు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు.

ఇదీ చూడండి: పోలెపల్లి ఔషధ పరిశ్రమల కాలుష్యంపై చర్యలకు శ్రీకారం

Intro:AP_GNT_28a_23_MLA_MALLADI_PC_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. )వైకాపా ప్రభుత్వంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉంటుందని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుమల లో బస్ టికెట్లను తెదేపా ప్రభుత్వమే ముద్రించిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను చూపించారు. తెదేపా, భాజపా లు ప్రభుత్వం హిందు వ్యతిరేకి అనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. గోవుల మృతి వ్యవహారం ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదన్నారు.

Body:bite

Conclusion:మల్లాది విష్ణు, శాసనసభ్యులు, విజయవాడ సెంట్రల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.