ఏపీలోని నాడు-నేడు తరహా కార్యక్రమం అమలు చేసి పాఠశాలలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ భావిస్తోంది. నాడు-నేడు కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వానికి సమకూర్చిన సాఫ్ట్ వేర్‌ను తమకు సైతం ఇవ్వాలని టీసీఎస్‌ను విద్యా శాఖ కోరింది. అయితే తమకు అభ్యంతరం లేదని ఏపీ నుంచి ధ్రువపత్రం తీసుకోవాలని టీసీఎస్ సూచించింది.
టీసీఎస్ రూపొందించిన సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా నిరభ్యంతర పత్రం ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా... ఏపీ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: WTC: ఫైనల్లో తలపడే భారత జట్టు ఇదే