సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్ విధించారు. రాత్రి కావటంతో అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపు ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
ఇది ఇలాఉండగా అఖిలప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియకు ఆరోగ్యం సరిగా లేదని పిటిషన్ పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు కోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్