ETV Bharat / state

CONGRESS: 'కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలి' - telangana latest news

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతగడ్డ గజ్వేల్ కేంద్రంగా.. తెరాస పాలనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటికీ.. ప్రజలకు స్వేచ్ఛ లేదని, కేసీఆర్ కబంధ హస్తాల్లో రాష్ట్రం చిక్కుకుందని ధ్వజమెత్తారు. తెలంగాణను కాపాడేందుకు.. తుది దశ ఉద్యమం చేయ్యాల్సి ఉందన్నారు. గజ్వేల్ సభ విజయవంతం కావడంతో.. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ సమస్యపై ధర్మయుద్ధం చేయనున్నట్లు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు.

CONGRESS: 'కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలి'

author img

By

Published : Sep 18, 2021, 5:28 AM IST

Updated : Sep 18, 2021, 6:45 AM IST

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై ధర్మ యుద్ధం చేయనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ యువత ఆకాంక్షల పరిరక్షణే లక్ష్యంగా అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలని, అందుకే కుటుంబానికి సెలవు పెట్టి బూత్‌కి 9 మంది కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 19 నెలలు పనిచేసి సోనియమ్మ రాజ్యం తెచ్చుకుందామన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ తదితరులు హాజరయ్యారు. సర్కారుపై ధర్మయుద్ధం

రేవంత్‌ మాట్లాడుతూ... ‘‘ఆంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ చచ్చినా, తెలంగాణలో చావుబతుకుల మధ్య ఉన్నా ఈ ప్రాంతవాసుల పోరాటాన్ని గౌరవిస్తూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో దుర్మార్గ పాలన నడుస్తోంది. ఉద్యమం చేసినందుకు.. కేసీఆర్‌ కుటుంబానికి మూడు మంత్రి పదవులు దక్కాయి. 12 శాతం ఉన్న మాదిగలకు మాత్రం ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదు.

దళితులు, గిరిజనులను చదువులకు దూరం చేసిన సర్కార్‌

రాష్ట్రంలో 4,632 బడులను ఈ ప్రభుత్వం మూసేసింది. దళితులు, గిరిజనులను చదువులకు దూరం చేసింది. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ తెస్తే... కరోనాను ఆ పథకంలో చేర్చకుండా ఎన్నో ప్రాణాలు పోయేందుకు కేసీఆర్‌ కారణమయ్యారు. అన్ని వర్గాల ప్రజల బతుకులు చితికిపోయాయి. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దింపకపోతే మాకొచ్చిన నష్టమేం లేదు. మాకూ ఆస్తులు ఉన్నాయి. విదేశాలకు పంపి చదువులు చెప్పించే స్తోమత ఉంది. మా ఆవేదనంతా మన తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసమే.

సైదాబాద్‌ ఘటన కన్నీళ్లు తెప్పించింది

సైదాబాద్‌లో ఆరేళ్ల గిరిజన బాలికను అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన విషయం తెలిసి నాకు ఏడుపొచ్చింది. నగరంలో ఏడు లక్షల కెమెరాలు ఉన్నాయని చెప్పే పోలీసు ఉన్నతాధికారులు... ఎందుకు నిందితుడిని ఏడు రోజులయినా అరెస్టు చేయలేకపోయారు? ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు నేరెళ్లలో దళిత బిడ్డలను దారుణాతిదారుణంగా కొట్టారు. గిట్టుబాట ధర కావాలని అడిగితే ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి నడిరోడ్డులో నడిపించారు. ఉద్యోగాలు రాక కళ్లముందే యువకులు పిట్టల్లా రాలుతున్నా కనీసం ముఖ్యమంత్రి స్పందించడం లేదు. కనీస మానవత్వం లేని ముఖ్యమంత్రి కేసీఆర్‌. గజ్వేల్‌కు ఆయన ఒక్క పరిశ్రమ తేలేదు. మల్లన్నసాగర్‌ కోసం 60 వేల ఎకరాల భూములను గుంజుకున్నారు. 14 గ్రామాల ప్రజలను ముంచేసి వారికి నిలువ నీడ లేకుండా చేశారు. కొండపోచమ్మ వద్ద ఓ విత్తన సంస్థ భూములను కాపాడేందుకు ప్రజల భూములను లాక్కున్నారు’’ అని రేవంత్‌ విమర్శించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నేతలు బోసురాజు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, అజారుద్దీన్‌, మహేష్‌గౌడ్‌, దామోదర రాజనర్సింహా, మధుయాస్కీ గౌడ్‌, షబ్బీర్‌ అలీ, జీవన్‌రెడ్డి, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వీరయ్య, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌, ప్రీతమ్‌, జగన్‌లాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

తెరాస పాలనపై కాంగ్రెస్‌ ఛార్జిషీటు

.

దాదాపు ఏడున్నరేళ్ల తెరాస పాలనపై కాంగ్రెస్‌ ఛార్జిషీటు ప్రకటించింది. 15 అంశాలతో కూడిన ‘కేసీఆర్‌ మోసాలపై పీపుల్స్‌ ఛార్జిషీటు’ను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. అనంతరం పార్టీ సీˆనియర్‌ నాయకుడు దామోదర రాజనర్సింహా వాటిని చదివి వినిపించారు. అందులోని ముఖ్యాంశాలు

* తొలి ముఖ్యమంత్రి దళితుడేనన్న కేసీఆర్‌.. ఆ మాట మరిచి తానే గద్దెనెక్కారు.

* దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట తప్పారు.

* ఆత్మగౌరవంతో బతకడానికి పేదవారికి సొంత ఇల్లు ఇస్తామని చెప్పి.. కేవలం 30 వేలు మాత్రమే ఇచ్చారు.

* తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్నారు. బిస్వాల్‌ కమిటీ ప్రకారం దాదాపు 2 లక్షల ఖాళీలున్నా భర్తీ చేయలేదు.

* తెరాస ప్రభుత్వం దళితుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు, గిరిజనులకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తామంది. వాగ్దానాన్ని మరిచి ఎస్సీ ఉపప్రణాళిక నిధులను పక్కదోవ పట్టించింది.

* జనాభా ప్రాతిపదికన దళితులకు 18 శాతం, గిరిజనులకు 10 శాతం వరకు రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నా పట్టించుకోలేదు.

* కేజీ నుంచి పీజీ అని చెప్పి.. విద్యారంగం నిర్వీర్యమయ్యేలా దాదాపు 4,500 బడులను మూసేశారు.

* దళిత, గిరిజన ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు అరకొర నిధులు కేటాయించి మోసం చేస్తున్నారు.

* కాంగ్రెస్‌ హయాంలో రేషన్‌ దుకాణాల్లో 9 రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తే.. తెరాస ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే ఇస్తోంది.

* కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయడం లేదు. వారికి ఏ రకంగానూ అండగా లేదు.

* వైద్య రంగానికి అవసరమైన నిధులు కేటాయించటం లేదు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు దూరమయ్యాయి.

.

స్వాతంత్య్ర పోరాటంలో ఏ పాత్రా లేని భాజపా: ఖర్గే

ప్రాణాలకు తెగించి కొట్లాడి, జైళ్లకు వెళ్లి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని ఈ పోరాటంలో భాజపాకు ఎలాంటి పాత్రా లేదని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కనీసం ఆ పార్టీ నేతల ఇంట్లో కుక్క కూడా చావలేదన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం మీవల్లే సాధ్యమైందంటూ కుటుంబంతో సహా కేసీఆర్‌ సోనియాను కలిశారు. దండంపెట్టి ఆమెతో ఫొటో దిగారు. మరుసటి రోజే ఆయన మాట మార్చారు. నరేంద్ర మోదీ పాలనలో పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చీకట్లో ఉన్నాయి. వారికి దారి చూపాలి’’ అంటూ అందరినీ సెల్‌ఫోన్‌ టార్చిలు వేయాలని ఖర్గే కోరారు. దీంతో సభాప్రాంగణంలో ఎక్కడ చూసినా సెల్‌ఫోన్‌ లైట్లే కనిపించాయి.

మోసపోవడానికి దళితులు సిద్ధంగా లేరు: భట్టి

‘‘రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా కేవలం నాలుగు మండలాల్లో 10వేల మందిని తీసుకున్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ ఇవ్వాలంటే రూ.1.80 లక్షల కోట్లు అవసరం. బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రకటించకుండా ఇస్తామని చెబితే ఇది మరో ఎన్నికల హామీగా మిగిలిపోతుంది. కేసీఆర్‌ను నమ్మి మరోసారి మోసపోవడానికి దళితులు సిద్ధంగా లేరు’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Last Updated : Sep 18, 2021, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.