హైదరాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్పై నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వివిధ కళాకారులు విన్యాసాలు, నృత్యాలు చేస్తూ... ర్యాలీగా వెళ్లారు. ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మ వాహనం చూపరులను ఆకర్షించింది. వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభా రాణి రావడం వల్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ గేమ్ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య