ETV Bharat / state

తీర ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ - తీర ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

సముద్ర తీర ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు భద్రతపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత భద్రత, సముద్రం వైపు నుంచి వచ్చే ఉగ్ర సవాళ్లపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ రాష్ట్రాల డీజీపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దూరదృష్య సమీక్ష నిర్వహించింది.

తీర ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
author img

By

Published : Sep 24, 2019, 5:02 AM IST

Updated : Sep 24, 2019, 8:06 AM IST

తీర ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు సముద్రం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి అన్ని సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. తీరప్రాంత భద్రత, సముద్రం వైపు నుంచి ఎదురయ్యే ఉగ్ర సవాళ్ల అంశంపై జాతీయ స్థాయిలో ఏర్పాటు అయిన కమిటీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షిచింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులతో మాట్లాడారు. సముద్రంలో చేపల వేట సాగించే వివిధ మోటరైజ్డ్ బోట్లు, ఇతర రకాల బోట్ల నియంత్రణను సంబంధిత శాఖలు పటిష్ఠ నిఘాతో పర్యవేక్షించాలని కేంద్రం ఆదేశించింది.

మెకనైజ్డ్ బోట్ల ద్వారా చేపలవేట సాగించే మత్స్యకారులందరికీ బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు జారీ చేయాలని స్పష్టం చేసింది. తీరప్రాంత భద్రతా దళం, నౌకాదళం, రాష్ట్ర మెరైన్ పోలీస్, స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు సముద్ర తీర భద్రత విషయంలో పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించింది. తీరప్రాంత రాష్ట్రాలన్నీ మారిటైమ్ బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం సముద్రం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్పష్టం చేశారు. సముద్రంలో చేపలవేట సాగించే బోటులకు ఉపగ్రహ ఆధారిత ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

దీనిపై స్పందిచిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ బోర్డును మరింత సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా భద్రతా దళాలకు చెందిన కొంత మందిని సభ్యులుగా తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తీర ప్రాంత రక్షణలో భాగంగా రాష్ట్రానికి మొదటి విడతగా 18 ఇంటర్ సెప్టార్ బోట్లను కేటాయించారని వాటికి వార్షిక మరమ్మతులు అవసరం ఉందని తెలిపారు.

ఇదీ చదవండిః వినోద్ ట్వీట్​కు... కేటీఆర్ ఏం చేశాడంటే!

Intro:ap_knl_51_23_vidyarthula_avasthalu_vo_ab_AP10055 s.sudhakar, dhone పాఠశాలకు వెళ్లాలంటే కాళ్లు తడుపుకుని వెళ్లాల్సిందే. పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు కాళ్లు తడుపుకొని వెళ్లాల్సిందే. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మల్కాపురం గ్రామం లోని రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు ఆగింది. పాఠశాలకు వెళ్లాలంటే ఈ బ్రిడ్జి లో నుండి వెళ్లాలి. కర్నూలు జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. విద్యార్థులకే కాదు, బ్యాంకుకు వెళ్లాలన్న, వలసల గ్రామానికి పోవాలన్న ప్రజలకు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కొందరు విద్యార్థులు బ్రిడ్జి లో వర్షపు నీరు ఉన్నందువలన బ్రిడ్జిలో రాకుండా, రైల్వే ట్రాక్ పైన దాటుతున్నారని విద్యార్థిలు వాపోయారు. ఇలా వెళ్లడం వలన ప్రమాదాలు జరగవచ్చు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న వర్షాలకు కూడా మాకు ఇలాంటి అవస్థలు తప్పడం లేదన్నారు. అధికారులు ఇక్కడ వర్షపునీరు ఆగకుండా చూడాలని వారు కోరుతున్నారు. బైట్. 1.భారతి విద్యార్థిని. 2.మానస విద్యార్థిని.

Body:పాఠశాలకు వెళ్లాలంటే కాళ్లు తడుపుకుని వెళ్లాల్సిందే

Conclusion:kit no.692, cell no.9394450169.
Last Updated : Sep 24, 2019, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.