హితం యాప్‌తో పాటు కొవిడ్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ఇతర రాష్ట్రాలకు తెలుపుతామని వీకే పాల్ అన్నారు. కరోనా నివారణ చర్యలపై మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. కేసుల తీవ్రత అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో ఆ బృందం చర్చించింది.
నమూనాపై ప్రజెంటేషన్
గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నివారణకు సూచనలు ఇచ్చిన కేంద్ర బృంద సభ్యులు.. కంటైన్మెంట్ను పటిష్టంగా అమలు చేసేందుకు దిల్లీ నమూనాపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మహమ్మారి నియంత్రణలో కీలకమైన కరోనా నిర్ధరణ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని వీకే పాల్ అన్నారు. వ్యాప్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కలిసి పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో సన్నద్ధత, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు, రోగులకు చికిత్స తదితరాలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు.
రోజుకు 40 వేల పరీక్షలు
వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రంతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని అన్నారు. రోజుకు 40 వేల పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సీఎస్.సోమేశ్ కుమార్ వివరించారు. కరోనా నివారణకు అదనంగా నిధులు కూడా మంజూరు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి : కరోనాను కట్టడిచేయకుండా సీఎం కేసీఆర్ నిద్రపోతున్నారు : జేపీ నడ్డా