హైదరాబాద్లోని పంజాగుట్టా నిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్య సదుపాయం ఉందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ అవకాశం లేదన్నారు. తెరాస ప్రభుత్వం కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రజలకు కూడా కల్పించాలని తెలిపారు.
ప్రజల మందుల కొనుగోళ్లకు అయ్యే ఖర్చును తగ్గించే లక్ష్యంతో కేంద్రం దేశ వ్యాప్తంగా జన ఔషద యోజన కింద మందుల దుకాణాలను ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. జనరిక్ మెడిసిన్ ద్వారా తక్కువ ధరలకే తగిన మందులు లభిస్తాయని చెప్పారు.
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం : రేవంత్