సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యంగంపై అవగాహన లేని సీఎం ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకమని అంటున్నారని మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సమ్మెలు చేశారని నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుకోవాలని చూడడం సరికాదన్నారు. కార్మికులు 5వ తేదీ అర్థరాత్రి వరకు విధుల్లో చేరాలని హుకుం జారీ చేయడం అప్రజాస్వామికమని తెలిపారు.
ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్ దుయ్యబట్టారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ను న్యాయస్థానానికి పిలిచి ప్రశ్నించాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆక్షేపించారు. మనీ లాండరింగ్, అక్రమాలు సీబీఐ కేసులు ఉన్న కేసీఆర్ పైనా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచనలు... వేర్వేరుగా సమావేశాలు