ప్రభుత్వం విధించిన గడువు రేపు అర్థరాత్రికి ముగియనుంది. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ ప్రణాళికపై టీఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ యూనియన్లు వేర్వేరుగా హైదరాబాద్లో సమావేశమయ్యాయి. కార్మికుల్లో మనోధైర్యం ఏవిధంగా నింపాలి, సమ్మెపై నెలకొన్న భిన్నాభిప్రాయాలు ఎలా నివృత్తి చేయాలనే అంశాలపై యూనియన్ల నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎంయూ, చిక్కడపల్లిలోని ఓ హోటల్లో ఎన్ఎంయూ, హిమాయత్ నగర్లోని ముగ్దుమ్ భవన్ సీపీఐ కార్యాలయంలో ఎంప్లాయిస్ యూనియన్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు ఏమనుకుంటున్నారు? సమ్మెపై ఫీడ్ బ్యాక్ ఏవిధంగా ఉంది? అనే విషయాలపై బాధ్యులతో మాట్లాడుతున్నారు. సమ్మె కొనసాగింపు తదితర అంశాలపై మంతనాలు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: ఇకపై రైరై... హైదరాబాద్లో మరో పైవంతెన ప్రారంభం