ETV Bharat / state

రాబోయే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి - అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి

రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కనీసం రూ. 25 వేల కోట్లు కేటాయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ ముగ్దుం భవన్‌లో అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్‌-వాస్తవాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

The budget for agriculture should be increased in the coming budget in telangana
రాబోయే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి
author img

By

Published : Feb 21, 2020, 9:15 AM IST

వచ్చే తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కనీసం 25 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో వ్యవసాయ రంగం, రైతాంగం అభివృద్ధి చెందకపోగా సంక్షోభం నుంచి బయటపడదని అభిప్రాయపడ్డాయి. హైదరాబాద్ ముగ్దుం భవన్‌లో అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ బడ్జెట్‌-వాస్తవాలపై చర్చా కార్యక్రమం జరిపారు. వ్యవసాయ రంగం సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, త్వరలో ముగియనున్న రబీ పంట కాలం, రాబోయే ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లు, నాణ్యమైన విత్తనాలు, సంస్థాగత రుణాలు, పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో పథకాలను చేర్చవద్దని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. రైతుబంధు, రైతుబంధు బీమా, రుణమాఫీ వంటి పథకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు.. పథకాలకు పోగా వ్యవసాయ రంగానికి మిగిలేది 13 వేల కోట్ల రూపాయలేనని పేర్కొన్నారు. అవి ఏ మూలకు సరిపోకపోగా, సంక్షోభం మరింత ముదిరిపోతోందని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆత్మహత్యల నివారణే సమగ్ర వ్యవసాయాభివృద్ధి

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణే సమగ్ర వ్యవసాయాభివృద్ధి అని అభిప్రాయపడుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్‌ కుమార్, తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

రాబోయే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి

ఇదీ చూడండి : బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.