ETV Bharat / state

పల్లెల్లో ప్రగతి పరుగులు షురూ...

పల్లెల రూపురేఖలను మార్చుకొనేందుకు నడుం బిగించాలని రాష్ట్రంలోని గ్రామ సభలు సంకల్పించాయి. నిధుల కొరత ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసినందున ఇక గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకొని వాటికి అనుగుణంగా పనులను చేపట్టాలని, ఉపాధి హామీ వంటి పథకాల తోడ్పాటును పొందాలని తీర్మానించాయి. ప్రభుత్వం మీదే అధారపడటం కాకుండా గ్రామాల అభివృద్ధికి గ్రామస్థులు సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి.

The beginning of the second phase of Palle Pragati in Telangana State
పల్లెల్లో ప్రగతి పరుగులు షురూ...
author img

By

Published : Jan 3, 2020, 7:48 AM IST

తెలంగాణ వ్యాప్తంగా పల్లెప్రగతి రెండో విడత కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజున గ్రామ సభలతో పల్లెలు హోరెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో కలియతిరిగారు. రెండో విడత కార్యక్రమాల పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లోని నలుగురు అధికారులను నియమించటం, 2019 సెప్టెంబరు 6వ తేదీ నుంచి నెలరోజుల పాటు నిర్వహించిన మొదటి విడతలో చేపట్టిన పనుల తనిఖీకి 51 మంది అఖిల భారత సర్వీస్‌ అధికారులను కేటాయించటం వంటి చర్యల ప్రభావం గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పర్యటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట సభలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. గ్రామానికి కేఎన్‌ఆర్‌ గ్రూపు రూ.20 కోట్ల విరాళాన్ని ఇచ్చి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచినట్టు ఆయన కొనియాడారు. మిగతా మంత్రులూ తమతమ జిల్లాల్లోని సభలకు హాజరై పచ్చదనం, పరిశుభ్రతలపై గ్రామస్థులతో మాట్లాడారు.

సర్వతోముఖాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

పల్లెప్రగతిలో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని కోనాయిపల్లి(పీటీ)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా శుభ్రత పాటిస్తేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

పల్లెప్రగతికి దీటుగా పట్టణ ప్రగతి

పల్లెలు ప్రగతిబాట పట్టినట్లే.. పట్టణాల్లో ప్రగతికాంతులు నింపుతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మోహినికుంటలో నిర్వహించిన పల్లెప్రగతి రెండో విడత కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితో కలిసి గురువారం ఆయన పాల్గొన్నారు. పురపాలిక ఎన్నికలు ముగిసి పట్టణాల్లో పాలకవర్గాలు కొలువుదీరిన వెంటనే పల్లెప్రగతికి దీటుగా పట్టణ ప్రగతిని చేపడతామని చెప్పారు. 30 రోజుల ప్రణాళికలో అన్ని గ్రామాలను అధికారులు కలియతిరిగి ప్రజలను చైతన్య పరిచారని, 70 ఏళ్లలో చేయలేని పనులను 30 రోజుల్లో పూర్తిచేశారన్నారు.

మండలానికి పది ఆదర్శగ్రామాలు

రాష్ట్రంలో ఒకప్పుడు ఆదర్శ గ్రామం అంటే గంగదేవిపల్లిని చూపించేవారని, కానీ ప్రస్తుతం అలాంటి గ్రామాలు మండలానికి పదికిపైగా ఆవిర్భవించాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇదంతా ముప్పైరోజుల ప్రణాళిక స్ఫూరితోనే సాధ్యమైందన్నారు.

ఇవీచూడండి: నేడు ఇండియన్​ సైన్స్​ కాంగ్రెస్​ను ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.