బీసీ ప్రధానమంత్రిగా ఉండి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకపోతే చరిత్ర క్షమించదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరమని తెలిపారు. రిజర్వేషన్ల పోరాటంలో బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి రావాలని ఆయన కోరారు. ప్రధాని మోదీపై బీసీలంతా నమ్మకంతో ఉన్నారని, ఇప్పటికైనా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేశ్, రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, లక్ష్మణ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి పాల్గొన్నారు.