ETV Bharat / state

ఆసుపత్రికి వస్తే... సగం వ్యాధి తగ్గినట్టే: బాలకృష్ణ - kodela

హైదరాబాద్​లోని బసవతారకం ఆసుపత్రిలో 19వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాలకృష్ణ, కోడెల శివప్రసాద్​, నామ నాగేశ్వరరావు హాజరయ్యారు.

'ఆసుపత్రికి వస్తే... సగం వ్యాధి తగ్గినట్టే'
author img

By

Published : Jun 22, 2019, 7:54 PM IST

బసవతారకం ఇండో అమెరికన్​ కేన్సర్​ హాస్పిటల్​ 19వ వార్షికోత్సవ వేడుకలను ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఛైర్మన్​, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, బోర్డు సభ్యులు కోడెల శివప్రసాద్​ రావు, నామ నాగేశ్వరరావు, సంస్థ ఉద్యోగులు, తదితర నేతలు పాల్గొన్నారు.

'ఆసుపత్రికి వస్తే... సగం వ్యాధి తగ్గినట్టే'

దివంగత నేత నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం 19వ వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. మహోన్నత ఆశయంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని కోడెల శివప్రసాద్​ అభిప్రాయపడ్డారు. సేవలు మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.

ఎలాంటి లాభాలను ఆశించకుండా అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని కేన్సర్​ రోగులకు అందించే లక్ష్యంతో బసవతారకం ఆసుపత్రి పనిచేస్తోందని ఆసుపత్రి ఛైర్మన్​ బాలకృష్ణ స్పష్టం చేశారు. రోగులకు మానసిక దృఢత్వాన్ని అందించడంలో తాము ఎంతగానో కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: వనజీవి ఆశయం.. పిల్లలకు పాఠ్యాంశం..

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.