ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: ఆస్ట్రేలియాలో విద్యార్థుల ఉపాధికి గండి - Live Coronavirus updates

కరోనా... విదేశాల్లోని తెలుగు విద్యార్థుల పొట్ట కొట్టింది. ఆస్ట్రేలియాలో చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగాలు చేసే వారికి ఉపాధి కరవైంది. లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ మూతపడడం వల్ల విద్యార్థుల చిరుద్యోగాలు పోయి.. ఇబ్బందులు పడుతున్నారు. ఆస్ట్రేలియాలో యంగ్‌ లిబరల్స్‌ మల్టీ కల్చరల్‌ ఛైర్మన్‌, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థుల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న తెలంగాణకు చెందిన ఆర్‌.శివనాథ్‌రెడ్డి అక్కడి పరిస్థితులను ‘ఈనాడు’కు తెలిపారు.

telugu students suffered in Australia
కరోనా ఎఫెక్ట్​: ఆస్ట్రేలియాలో విద్యార్థుల ఉపాధికి గండి
author img

By

Published : Apr 10, 2020, 7:02 AM IST

‘చదువుకుంటూ చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తున్న వారే లాక్​డౌన్​ తర్వాత దేశంలో ఉండాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వారు లాక్​డౌన్​ ముగియగానే స్వదేశాలకు వెళ్లాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం సూపర్‌ మార్కెట్లు, గ్యాస్‌ స్టేషన్లలో పని చేస్తున్న వారికే ఉపాధి ఉంది. మిగిలిన వారు ఖాళీ. అలాంటి వారికి మేం నిత్యావసర వస్తువులను ఉచితంగా అందిస్తున్నాం. ఇక్కడ కరోనా వ్యాప్తి కొంత నియంత్రణలో ఉంది. లాక్‌డౌన్‌ ఎక్కువ కాలం కొనసాగేలా ఉంది. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 1.20 లక్షల మంది ఉంటారు. వీరిలో ఎక్కువ మంది హాస్పిటాలిటీ రంగంలో చిరుద్యోగాలు చేస్తారు. ఆ రంగం పూర్తిగా మూతపడటంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

హై కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి

‘అంతర్జాతీయ విమానాలు పునరుద్ధరించిన తరువాత విదేశీ విద్యార్థులు మాతృదేశాలకు వెళ్లిపోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితులు కుదుటపడిన తరువాత మళ్లీ అనుమతిస్తామని తెలిపింది. ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన విదేశీయులకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. మన విద్యార్థులను ఆదుకునేందుకు భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని సంప్రదించగా, సానుకూలంగా స్పందించింది. సహాయం కావాల్సిన వారు https://www.hcicanberra.gov.in/register వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరింది. ఇక్కడ చదువుకుంటూ చట్టబద్ధంగా ఏడాది, అంతకు మించిన కాలం నుంచి ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు సూపర్‌ యాన్యుయేషన్‌ వినియోగించుకునేందుకు ప్రభుత్వంఅనుమతించింది. ఇక్కడ నిత్యావసర వస్తువులకు కొరత లేదు. కానీ సూపర్‌మార్కెట్లలోకి పదేసి మంది చొప్పున మాత్రమే అనుమతిస్తుండడంతో కొంత సమయం పడుతోంది’ అని శివనాథ్‌రెడ్డి వివరించారు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన

వైద్యవిద్య అభ్యసించేందుకు కిర్గిస్థాన్‌ వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. కిర్గిస్థాన్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం... వైద్యసదుపాయాలు అంతంతమాత్రంగా ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అక్కడి విద్యార్థులు కొందరు ‘ఈనాడు’కు ఫోన్‌ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

దాదాపు 15 వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడ వైద్యవిద్యనభ్యసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1500 మంది ఆ దేశ రాజధాని బిష్కేక్‌లోని వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. కరోనా కారణంగా 20 రోజుల నుంచి హాస్టళ్లు, గదులకే పరిమితమయ్యారు. 70 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటికే 280 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ ఉద్ధృతి పెరిగితే వైద్యం అందటం కష్టమని విజయవాడకు చెందిన విద్యార్థుల సమన్వయకర్త మోహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపి తమను భారత్‌కు రప్పించాలని కోరారు. వారు ఇక్కడికి వచ్చాక, క్వారంటైన్‌ సమయం పూర్తయ్యాకే ఇంటికి పంపవచ్చని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలని ఖమ్మంకు చెందిన విద్యార్థి మారెడ్డి శ్రీరామ్‌ తండ్రి నాగేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.