ETV Bharat / state

పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు.. అప్లై చేశారా? - Tspsc recruitment 2022

TS police recruitment : పోలీసు నియామక మండలి భర్తీ చేయనున్న కొలువులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలకు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులు నేటి రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

The application process for TS police jobs ends today
పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఈరోజే ఆఖరి రోజు... అప్లై చేశారా?
author img

By

Published : May 20, 2022, 11:53 AM IST

Updated : May 20, 2022, 1:25 PM IST

TS police recruitment : పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. అభ్యర్థులు నేటి రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో 17వేల 2 వందల 91 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2న ప్రారంభమమైన ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తకుండా అధికారులు సామర్థ్యాన్ని పెంచారు. గురువారం ఒక్క రోజే లక్ష దరఖాస్తులు వచ్చాయి. ఒకేసారి నగదు చెల్లింపులు జరుపుతుండటంతో, సాంకేతికత సమస్యలు తలెత్తుతున్నాయి. నగదు చెల్లింపుజరిగితేనే దరఖాస్తు ప్రక్రియ పూర్తవతుందని పోలీసు నియామక మండలి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఖాతాలో నగదు డెబిట్ అయినా... వారం వ్యవధిలో తిరిగి ఖాతాలో జమ అవుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 10లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు తెలిపారు. వచ్చే మార్చి కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Last Updated : May 20, 2022, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.