తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం చేస్తున్న కేంద్రం ఆర్టీసీపై ఎలా స్పదింస్తుందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీని ఆదుకోవడానికి కేంద్రం ఏదైనా సాయం చేసి ఉంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పేది నిజమని నమ్మే వాళ్లమని అన్నారు.
ఆర్టీసీ నష్టాల్లో పాలుపంచుకోకుండా, సమ్మె విషయంలో కేసీఆర్‌కు సలహాలిచ్చే హక్కు ఉండదని లక్ష్మణ్‌కు తెలియకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారని పలువురు ప్రశంసిస్తుంటే, లక్ష్మణ్ మాత్రం చవకబారు విమర్శలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి : 'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి'