ETV Bharat / state

ఒకప్పటి దర్శకుడు ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు? - ఆ దర్శకుడు మాములు మోసగాడు కాదు... డైరెక్టర్ బషీద్ అరెస్ట్

తప్పుడు పత్రాలతో రుణాలు... బయానా పేరుతో మోసాలు... బ్యాంకులకు, తెలిసిన వారికి కోట్లలో కుచ్చుటోపీ. సినిమాల్లో అవకాశాలిప్పిస్తానని... నిర్మాణరంగ కంపెనీలకు రుణాలిస్తానంటూ మోసాలు. కోట్ల  రూపాయలు కొల్లగొట్టిన స్తిరాస్థి వ్యాపారి బషీద్ రెండు రోజులు క్రితం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

that-director-is-not-an-ordinary-cheater-dot-dot-dot-director-bashid-got-arrested
that-director-is-not-an-ordinary-cheater-dot-dot-dot-director-bashid-got-arrested
author img

By

Published : Dec 18, 2019, 6:07 AM IST

Updated : Dec 18, 2019, 8:59 AM IST

గుంటూరు జిల్లా వేజెండ్లకు చెందిన ఎస్​కే బషీద్​కు చిన్నప్పటి నుంచే సినిమాల పిచ్చి... ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చాడు. అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎలాగైనా సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాడు. భూములు, స్థలాలను బ్యాంకుల్లో తనఖా ఉంచి రుణం తీసుకుని ఎగవేయాలనుకున్నాడు. పదిహేనేళ్ల క్రితం నేరాలు మొదలు పెట్టిన బషీద్... తొమ్మిది చిత్రాలు నిర్మించాడు. ఐదేళ్ల క్రితం సినిమా హీరోగా ఓ చిత్రాన్ని విడుదల చేశాడు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్టై జైలుకెళ్ళాడు. బెయిల్​పై విడుదలై మళ్ళీ తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని టోకరా వేశాడు. రెండేళ్ల క్రితం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

విరామం అనంతరం కొత్త తరహా మోసాలు...

జైలు నుంచి విడుదలయ్యాక కాస్త విరామం తీసుకుని... కొత్త తరహా మోసాలకు తెరలేపాడు. ఎస్​బీకే గ్రూప్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించి... ముంబయి, చెన్నై, బెంగుళూరు, దుబాయ్​లో కార్యాలయాలు తెరిచాడు. కోట్లలో రుణాలిస్తానంటూ ధరావతు సొమ్ము పేరుతో లక్షల రూపాయలు బాధితుల నుంచి కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో మరోసారి జైలు పాలయ్యాడు.

సినిమాలు తీయడానికి డబ్బు కోసం భూములు, స్థలాలు లేకపోవడం వల్ల పరిచయస్థులు, స్నేహితులు, హైదరాబాద్​లో ఉంటున్న గుంటూరు జిల్లా వాసుల వివరాలను తెలుసుకున్నాడు. అనంతరం బంజారాహిల్స్​లో ఓ ఫ్లాటును అద్దెకు తీసుకున్నాడు. తాను సినిమాలు నిర్మిస్తున్నానని, పెట్టుబడులు పెడితే లాభాలిస్తానని ప్రచారం చేసుకున్నాడు. భార్య కరీమున్నీసాతో కలిసి మోసాలు కొనసాగించాడు.

నిందితుడు ఎస్​కే బషీద్​
నిందితుడు ఎస్​కే బషీద్​

తెలిసిన వారుంటే చాలు... వారి పత్రాలతో రుణాలు

వివాదాస్పద స్థలాలు... పరిచయస్థుల ఇళ్లే... బషీద్ లక్ష్యం. తనకు తెలిసిన వారి స్థలాల డాక్యుమెంట్లను జిరాక్స్ తీసుకుని అవి తనవేనని తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నాడు. బషీద్, విమల్ గోయల్ అనే వ్యక్తులు వజ్రాభరణాలు తయారు చేస్తామంటూ తమ వద్ద రూ. 2 కోట్ల రుణం తీసుకుని ఒక్క కిస్తీ చెల్లించలేదంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా హిమాయత్‌నగర్ శాఖ అధికారులు ఐదేళ్ల క్రితం సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు.

పరిచయస్థులు కె.ఉమ, సత్యనారాయణ, భరణిల ఇళ్లను తనఖా ఉంచి హెచ్ఎస్​బీసీ బ్యాంక్ నుంచి ఏడేళ్ల క్రితం 70 లక్షల రుణం తీసుకున్నాడు. బషీద్ కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు వారికి తాఖీదులు జారీ చేశారు. దీంతో వారు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

విజయలక్ష్మి అనే మహిళ పేరుతో ఉన్న ఆస్తి పత్రాలు తనఖా ఉంచుకుని 35 లక్షల రుణం కావాలన్నాడు. ఆమెను తీసుకురావాలని బ్యాంకు అధికారులు కోరగా... భార్య కరీమున్నీసాను తీసుకెళ్లి రుణం మంజూరు చేయించుకున్నాడు. బంజారాహిల్స్ పోలీస్ ఠాణా పరిధిలో షేక్ బషీద్​పై 2005 నుంచి 2007 వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి.

పదేళ్లలో లెక్కలేనన్ని మోసాలు...

ఇలా పదేళ్ళలో లెక్కలేనన్ని మోసాలకు తెరలేపిన బషీద్​ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయమని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తవ్వేకొద్దీ బషీద్ నేరాలు బయటకొస్తుండటం గమనార్హం.

ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్​ అనుచరుల వీరంగం

TG_HYD_05_18_HERO_BASHEED_PKG_3182400 రిపోర్టర్ నాగార్జున note: ఫిడ్ డెస్క్ వాట్సప్ కి పంపాము, జనరల్ షాట్స్ వాడుకోగలరు ( )తప్పుడు పత్రాలతో రుణాలు...బయానా పేరుతో మోసాలు...బ్యాంకులు, పరిచయస్థులకు కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన బషీర్ మోసాల చిట్టా ఒక్కటిగా బయటకు వస్తున్నాయి...ఒక్క రుణాలే కాదు సినిమాల్లో అవకాశాలిప్పిస్తానని.....నిర్మాణరంగం కంపెనీలకు రుణాలిస్తానంటూ బ్యాంకులు . . . బాధితులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన స్తిరాస్థి వ్యాపారిని రెండు రోజులు క్రితం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బషీద్ నేరాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి . వాయిస్ గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామానికి చెందిన ఎస్ కే బషీద్ కు చిన్నప్పటి నుంచి సినిమాల పిచ్చి..ఇరవైఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. సినిమాల్లో అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎలాగైనా సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాడు...అందుకు అయ్యే డబ్బు కోసం మోసాలు మొదలు పెట్టాడు... భూములు, స్థలాలను బ్యాంకుల్లో తనఖా ఉంచి రుణం తీసుకుని ఎగవేయాలనుకున్నాడు..పదిహేనేళ్ల క్రితం నేరాలు మొదలు పెటిన బషీద్...తొమ్మిది చిత్రాలను నిర్మించాడు. ఐదేళ్ల క్రితం సినిమా హీరోగా ఓ చిత్రాన్ని విడుదల చేశాడు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకెళ్ళాడు. బెయిల్ పై విడుదలై మళ్ళీ తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేయడం లాంటి మోసాలతో కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా వేశాడు.రెండేళ్ల క్రితం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లిన బషీద్...ఈసారి కాస్త విరామం తీసుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపాడు. ఎస్ బీకే గ్రూప్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించి ఇదే పేరుతో ముంబయి, చెన్నై, బెంగుళూరు, దుబాయ్ లో నామ్ సేవాస్తే కార్యాలయాలు స్థాపించి కోట్లలో రుణాలిస్తానంటూ ధరావతు సొమ్ము పేరుతో లక్షల రూపాలయు బాధితులనుంచి గుంజాడు. బాధితుల ఫిర్యాదుతో మరో సారి జైలుకు వెళ్లాడు. వాయిస్ సినిమాలు తీయడానికి డబ్బు కోసం భూములు, స్థలాలు లేకపోవడంతో తన పరిచయస్తులు, స్నేహితులు, హైదరాబాద్లో ఉంటున్న గుంటూరు జిల్లా వాసుల వివరాలను తెలుసుకున్నాడు. అనంతరం బంజారాహిల్స్ లో ఓ ఫ్లాటను అద్దెకు తీసుకున్నాడు. తాను సినిమాలను నిర్మిస్తున్నాని, పెట్టుబడులు పెడితే లాభాలిస్తానని ప్రచారం చేసుకున్నాడు. తర్వాత బజూ ఎర్త్ మూవర్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. జేసీబీ కావాలంటూ బ్యాంకు నుంచి లక్షల్లో రుణం తీసుకున్నాడు. తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. తాను, తనభార్య కరీమున్నీసాలతో కలిసి మోసాలు కొనసాగించాడు. వివాదాస్పద స్థలాలు...పరిచయస్తుల ఇళ్లు...బషీద్ లక్ష్యం. తనకు తెలిసిన వారి స్థలాల డాక్యుమెంట్లను జిరాక్స్ తీసుకుని వాటిని తనవేనని తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల్లో రుణం తీసుకున్నాడు. బషీద్, విమల్ గోయల్ అనే వ్యక్తులు వజ్రాభరణాలు తయారు చేస్తామంటూ తమ వద్ద రూ . 2కోట్లు రుణం తీసుకుని ఒక్క కిస్తీ చెల్లించలేదంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా హిమాయత్ నగర్ శాఖ అధికారులు ఐదేళ్ల క్రితం సీసీఎస్ ఫిర్యాదు చేశారు. తనకు పరిచయస్తులైన కె . ఉమ , సత్యనారాయణ , భరణిల ఇళ్లను తనఖా ఉంచి హెచ్ఎస్బీసీ బ్యాంక్ నుంచి ఏడేళ్ల క్రితం 70లక్షల రుణం తీసుకున్నాడు. బషీద్ కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు ఉమ, సత్యనారాయణ, భరణిలకు తాఖీదులు జారీ చేశారు. దీంతో ముగ్గురు బాధితులు పంజాగుట్ట పోలీస్ రాణాలో ఫిర్యాదు చేయగా . . . బషీద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయలక్ష్మి అనే మహిళ పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను తనఖా ఉంచుకుని 35 లక్షల రుణం కావాలన్నాడు. విజయలక్ష్మిని తీసుకురావాలంటూ బ్యాంక్ అధికారులు బషీదను కోరడంతో తన భార్య కరీమున్నీసాను తీసుకెళ్లి ఈమే విజయలక్ష్మి అంటూ చెప్పి రుణం మంజూరు చేయించుకున్నాడు. బంజారాహిల్స్ పోలీస్ రాణా పరిధిలో షేక్ బషీద్ పై 2005వ సంత్సరం నుంచి 2007 వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి . బషీద్ తమను మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎండ్ వాయిస్ ఇలా పదేళ్ళలో లెక్క లేని మోసాలకు పాల్పడిన బషీద్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల అరెస్ట్ చేశారు..దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయమని పోలీసులు వెల్లడించారు.
Last Updated : Dec 18, 2019, 8:59 AM IST

For All Latest Updates

TAGGED:

Hero_Basheed
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.