ETV Bharat / state

టీవీ9 లోగో అమ్ముకున్నాడని రవి ప్రకాశ్​పై కేసు - tv9

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​పై మరో కేసు నమోదైంది. టీవీ9 లోగోను అమ్ముకున్నాడని అలందమీడియా డైరెక్టర్​ కౌశిక్​ రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు.

రవి ప్రకాశ్​
author img

By

Published : May 17, 2019, 12:11 AM IST

విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఈ కేసు పెట్టారు. టీవీ9 లోగోను రూ.99వేలకు రవిప్రకాశ్ విక్రయించాడని కౌశిక్ రావు పేర్కొన్నారు. రవిప్రకాశ్​తోపాటు ఎం.వి.కె.ఎన్ మూర్తి, హరికిరణ్ మీద ఈ కేసు నమోదు చేశారు. 406, 420, 467, 471, 120(బి) ఐపీసీ సెక్షన్లతో పాటు, 66, 72 ఐటీ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఈ కేసు పెట్టారు. టీవీ9 లోగోను రూ.99వేలకు రవిప్రకాశ్ విక్రయించాడని కౌశిక్ రావు పేర్కొన్నారు. రవిప్రకాశ్​తోపాటు ఎం.వి.కె.ఎన్ మూర్తి, హరికిరణ్ మీద ఈ కేసు నమోదు చేశారు. 406, 420, 467, 471, 120(బి) ఐపీసీ సెక్షన్లతో పాటు, 66, 72 ఐటీ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: సింహాన్నే పరిగెత్తించాడు- పోలీసులకు చిక్కాడు

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
బెల్లంపల్లి లో భూ ఆక్రమణలు
.... విచారణ జరుపుతున్న పోలీసులు
....కబ్జాదారుల్లో గుబులు పుట్టిస్తున్న విచారణ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భూ ఆక్రమణలకు అడ్డాగా మారింది. బెల్లంపల్లి పట్టణంలోని భూములన్నీ సింగరేణి ఆధీనంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇండ్లకు ఎలాంటి పట్టాలు లేవు. గత ఏడాది సింగరేణి యాజమాన్యం కన్నాల గ్రామ శివారులో ఉన్న 170 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించింది. పట్టణంలో ఉన్న ఖాళీ స్థలాలను కూడా ప్రభుత్వానికి అప్పగించాడాని కి ప్రణాళిక సిద్ధం చేసింది. వరుసగా ఎన్నికలు రావడం అక్రమార్కులకు వరంగా మారింది. ఇదే అదనుగా కబ్జాదారులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించిన వదలలేదు. భూ కబ్జాలకు తెర లేపారు. వీరి అక్రమాలు రెవెన్యూ అధికారులను బెదిరించే వరకు వెళ్లాయి. అధికారులు జిల్లా పాలనాదికరి భారతి హోల్లి కెరీ కి విన్నవించారు. ఆమె వెంటనే స్పందించి భూ కబ్జాదారుల పేర్లను ప్రకటించి విచారణ చేయాలని బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ ను ఆదేశించారు. ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూ ఆక్రమణదారుల పేర్లను బహిర్గతం చేశారు. ప్రకటించిన పేర్లలో అధికార పార్టీ కౌన్సిలర్ల తో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులే వున్నారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రధాన అనుచరులుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
*కబ్జాదారుల గుండెల్లో రైళ్లు
పోలీసులు విచారణ ప్రారంభించడంతో కబ్జాదారుల గుండేల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సర్వే నంబర్ 170లో 1700 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండాలి. ఖాళీ స్థలం 300 ఎకరాల వరకు అధికారుల లెక్కల ప్రకారం వుండాలి. అయితే పట్టణంలో ఖాళీ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో అధికార పార్టీ నేతల పేర్లు ఉండడం సంచలనం రేపుతోంది. పట్టణంలోని కన్నాల గ్రామ శివారు, శంషీర్ నగర్, అంబేద్కర్ నగర్, అంబెడ్కర్ రడగంబాల బస్తీ, గోల్ బంగ్లా బస్తీ, బెల్లంపల్లి బస్తీ, కాంట్రాక్టర్ బస్తి, కన్నాల బస్తీ, టేకుల బస్తీల్లో భూ కబ్జాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత మూడు రోజుల నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. భూకబ్జా దాడులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఇప్పటికే ఏసిపి ప్రకటించారు. మరో వారం రోజుల్లో భూ ఆక్రమణల వివరాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.




Body:బైట్
శ్రీనివాస్, తహసీల్దార్, బెల్లంపల్లి


Conclusion:బెల్లంపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.