ETV Bharat / state

అమెరికాలో జైలుకెళ్లి.. హైదరాబాద్​ తిరిగొచ్చిన ఆల్​ఖైదా!

author img

By

Published : May 27, 2020, 12:08 PM IST

ఆల్​ఖైదాకు ఆర్థికంగా సాయం చేశాడనే అభియోగంపై ఐదేళ్లు జైలు శిక్షను అనుభవించిన జుబేర్ అహ్మద్ హైదరాబాద్​ తిరిగి వచ్చేశాడు. అతను తిరిగొచ్చిన నేపథ్యంలో అతనిపై నిఘా ఉంటుందని పోలీసులు తెలిపారు.

terrorist zuber ahmad releases america came to hyderabad
అమెరికాలో జైలుకెళ్లి హైదరాబాద్​ తిరిగొచ్చిన ఆల్​ఖైదా!

అమెరికాలో నివాసముంటూ ఆల్​ఖైదాకు ఆర్థికంగా సహాయం చేశాడనే అభియోగంపై ఐదేళ్లు జైలు శిక్షను అనుభవించిన జుబేర్ అహ్మద్ హైదరాబాద్​ తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్ పేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

27 ఏళ్లు జైలు శిక్ష..

హైదరాబాద్ టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నివాసముంటూ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జుబేర్ 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లాడు. అక్కడి పౌరురాలిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. 2016లో జుబేర్ సోదరుడు ఆసిఫ్ అహ్మద్ సలీం, సుల్తాన్ సలీం ఆల్​ఖైదాకు చెందిన.. అల్-అవ్​లాకి ఆర్థిక సహాయం చేశారని అమెరికా అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో అమెరికా విచారించి జుబేర్ అహ్మద్​కు 5 ఏళ్లు, అతని సోదరుడు, మిగతా నేరస్థులకు దాదాపు 27 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇటీవల జుబేర్ శిక్షా కాలం పూర్తైన కారణంగా అమెరికా ప్రభుత్వం అతనిని విడుదల చేసింది.

ఇంటికి తిరిగొచ్చిన..

అక్కడి నుంచి భారత్ వచ్చిన తర్వాత జుబేర్ అమృతసర్​ క్వారంటైన్​లో ఉన్నాడు. హైదరాబాద్​లో అతనిపై ఎలాంటి కేసులు లేకపోవడం వల్ల అల్వాల్ హస్మత్ పేట్ ప్రాంతంకు తీసుకువచ్చారు. ఇంటికి తిరిగొచ్చిన జుబేర్ వ్యవహారంపై నిఘా ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతను ఇంట్లో హోమ్ క్వారంటైన్​​లో ఉంటున్నాడు.

ఇదీ చూడండి : కరోనా వేళ మిడతల దండయాత్ర.. తెలుగు రాష్ట్రాలకూ ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.