ETV Bharat / state

ప్రాణాలు తీస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు.. పట్టించుకోని అధికారులు - తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో విద్యుత్ నియంత్రికలు ఎన్నో ప్రాణాలు తీస్తున్నాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో వేలాడే తీగలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవలె నిశాంత్ అనే మరోబాలుడు ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకునే బిడ్డను ఆ స్థితిలో చూసి మాతృ హృదయం అల్లాడిపోతోంది. తన బిడ్డను ఆదుకోవాలని వేడుకుంటోంది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

transformers in hyderabad, transformers incidents in hyderabad
ట్రాన్సఫార్మర్ల ఘటనలు, భయంకరంగా ట్రాన్సఫార్మర్లు
author img

By

Published : Apr 12, 2021, 9:52 AM IST

హైదరాబాద్ నగరంలో విద్యుత్‌ నియంత్రికలు ప్రమాద ఘంటికలుగా మారాయి. నిత్యం జనంతో కిటకిటలాడే ప్రాంతాల్లోనూ వేలాడే విద్యుత్‌ తీగలు, ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాకాలంలో సమస్య మరింత జటిలమై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించే పరిస్థితి నెలకొంది. ఆడుకుంటూ రోడ్‌పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో నిశాంత్‌ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కొడుకు పడుతున్న ఇబ్బందిని చూసి ఆ కన్నపేగు తల్లడిల్లుతోంది. మౌలాలీలోని ఈస్ట్‌ మారుతినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశాంత్‌ తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. అన్నీ తానై సాకే బిడ్డను కాపాడేందుకు ఆదుకోవాలని ఆ తల్లి వేడుకుంటోంది. గతంలో ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగాయి.. అయినా విద్యుత్‌ అధికారుల్లో చలనం లేదు.

70 నుంచి 80శాతం..

నగరంలో లక్షకు పైగా విద్యుత్తు నియంత్రికలున్నాయి. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఇళ్ల మధ్యనే ఉండే విద్యుత్‌ నియంత్రికలతో... ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 70 నుంచి 80శాతం ట్రాన్స్‌ఫార్మర్లు కంచె లేకుండానే ఉన్నాయి. రోడ్ల పక్కన, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు, కూరగాయల మార్కెట్లు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేసినా... కనీసం వాటి చుట్టూ కంచెలు కనిపించవు. అక్కడే చెత్తను పారేస్తుండటంతో వేసవిలో ఓవర్‌లోడ్‌తో నిప్పు రవ్వలు పడి అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు చాలా కిందకు ఉన్నాయని, ముఖ్యంగా పార్కుల వద్ద కంచె లేని విద్యుత్‌ నియంత్రికలు భయపెడుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సింధికాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌ చెంతనే దుకాణాలు

గతంలో కంచెలు ఏర్పాటు చేసేందుకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌తో పలు ఏజెన్సీలు చర్చలు సాగించాయి. ఎలాంటి విద్యుదాఘాతం జరగకుండా కంచె ఏర్పాటుతో అక్కడే 3*4 పరిమాణంలో ప్రకటనలు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే సుమారు వెయ్యి నియంత్రికలకు కంచెలు ఏర్పాటు చేసి మిగితా వాటిని వదిలేశారు.

పలు కాలనీల్లో ఇదే పరిస్థితి

ఈ ప్రాంతాల్లో...: జేబీఎస్‌ నుంచి ప్యాట్నీ వైపు వచ్చే మార్గంలో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన విద్యుత్‌ నియంత్రిక పాదచారులను భయపెడుతోంది. మాసాబ్‌ట్యాంక్‌లోని మౌంటెడ్‌ పోలీస్‌గేట్‌ వద్ద, రామంతాపూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాల, మల్లాపూర్‌లోని అన్నపూర్ణకాలనీలో, సికింద్రాబాద్‌లోని ఎంజీరోడ్‌, జనరల్‌బజార్‌, ప్యారడైజ్‌, ఆర్‌పీరోడ్‌, సింధీకాలనీల్లోనూ అదే పరిస్థితి. జవహర్‌నగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ వలన పశువులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, గాంధీనగర్‌, దేవీచౌక్‌, తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ నియంత్రికలు, విద్యుత్‌ స్తంభాలకు అమర్చిన ఫ్యూజ్‌ బాక్స్‌లు అత్యంత ప్రమాదకరంగా మారాయి.

ఇదీ చదవండి: సాహసానికే సవాల్‌ విసురుతున్న ధీరలు.. వంద అడుగుల సొరంగంలో విధులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.