ETV Bharat / state

10/10.. ఈసారి 2 లక్షల మందికి! - తెలంగాణ వార్తలు

గత ఏడాది కంటే ఈసారి 10/10 గ్రేడ్‌ విద్యార్థుల సంఖ్య భారీగా పెరగనుంది. మొత్తం 5.21 లక్షల మందిలో సుమారు 2 లక్షల మంది 10/10 జీపీఏతో ఉత్తీర్ణులు కానున్నారని సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే ఫలితాల వెల్లడించేందుకు అధికార యంత్రాగం సమాయత్తం అవుతోంది.

tenth class, gpa score
పదో తరగతి ఫలితాలు, పదో తరగతి స్కోరు
author img

By

Published : May 18, 2021, 6:51 AM IST

రాష్ట్రంలో ఈసారి పదో తరగతి పరీక్షల్లో దాదాపు 40 శాతం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కనుంది. మొత్తం 5.21 లక్షల మందిలో సుమారు 2 లక్షల మంది 10/10 జీపీఏతో ఉత్తీర్ణులు కానున్నారని సమాచారం. అంటే గత ఏడాది కంటే ఈ సంఖ్య దాదాపు 60 వేలు ఎక్కువ. పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ-1) ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఆ ప్రకారం విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఈ నెల 11న ఉత్తర్వులిచ్చారు. ఈ క్రమంలో పరీక్ష రుసుం చెల్లించిన 5,21,393 మందికి గ్రేడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ప్రక్రియను దాదాపు పూర్తిచేశారు. ఫలితాలను రెండు, మూడు రోజుల్లో విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు.

గత ఏడాది 1.41 లక్షల మందే
గత విద్యా సంవత్సరంలో(2019-20) వార్షిక పరీక్షలు జరగకపోవడంతో నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు. అప్పుడు 5.34 లక్షల మందిలో మొత్తం 1,41,382 మంది విద్యార్థులు 10 జీపీఏ దక్కించుకున్నారు. ఈసారి(2020-21) కేవలం 40 రోజులే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. ఆ సమయంలోనే ఒక ఎఫ్‌ఏ జరిపారు. మరొకటి నిర్వహించాల్సి ఉండగా మళ్లీ పాఠశాలలను మూసివేశారు. దాంతో ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే గ్రేడ్లు ఇస్తున్నారు. దానివల్ల ఈసారి 10 జీపీఏ విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు దాటనుందని విశ్వసనీయంగా తెలిసింది. అంటే గత ఏడాది కంటే 60 వేల మంది అధికంగా ఉండనున్నారు. ఈ సంఖ్య పెరగడానికి ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగా గ్రేడ్లు ఇవ్వడమే కారణమని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.