ETV Bharat / state

అంచనాలకు మించి అభిమానుల రాక.. జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత..

జింఖానా మైదానం
జింఖానా మైదానం
author img

By

Published : Sep 22, 2022, 11:47 AM IST

Updated : Sep 22, 2022, 1:57 PM IST

11:45 September 22

జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్తత..

అంచనాలకు మించి అభిమానుల రాక.. జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత..

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్​ వేదికగా.. ఈ నెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్​ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్​ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే.. భారీగా అభిమానులు తరలివస్తున్నారు. హెచ్​సీఏ టిక్కెట్లను బ్లాక్​లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్​ఆర్సీలో పిటిషన్​ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆఫ్​లైన్​లో టికెట్లు ఇస్తామని హెచ్​సీఏ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్​ గేట్​ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక సమస్యతో ఆన్​లైన్​ పేమెంట్లకు అంతరాయం కలిగింది. నగదు తీసుకుని సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు.

భారత్-ఆసీస్​ మ్యాచ్​ టికెట్ల వ్యవహారం కొంతకాలంగా ప్రహసనంగా మారింది. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాస్​ల జారీలోనూ గందరగోళం ఏర్పడింది. కొవిడ్​ పరిస్థితుల వల్ల క్రికెట్​ మ్యాచులు వీక్షించేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. ఐపీఎల్​ మ్యాచ్​లు కూడా హైదరాబాద్​లో నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత హైదరాబాద్​లో మ్యాచ్​ జరుగుతుండటంతో.. అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. అయితే సులభ ప్రక్రియలో టిక్కెట్లు ఇవ్వడంలో హెచ్​సీఏ పూర్తిగా విఫలమైంది.

అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో.. తోపులాట జరగడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వీఐపీ పాస్​ల కోసం కూడా తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Sep 22, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.