హైదరాబాద్ దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపో ముందు సమ్మె కాలంలో పనిచేసిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని, తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాము పనిచేసే ఉద్యోగాలు వదిలిపెట్టి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా 52 రోజులు పనిచేశామని... పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందనుకునే ఆశతో పనిచేశామన్నారు. ముఖ్యమంత్రి ఇంత వరకు తమ గురించి స్పందించకపోవడం బాధాకరమంటూ అవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: శివానగర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు