ETV Bharat / state

తాత్కాలిక వైద్య సిబ్బంది సేవలకు స్వస్తి! - శ్రీకాకుళం తాత్కాలిక వైద్య సిబ్బంది ఆందోళన

కరోనా వ్యాప్తి కట్టడికి అహోరాత్రులు శ్రమించారు కొవిడ్ కేర్ కేంద్రం తాత్కాలిక సిబ్బంది. కన్నవారిని సైతం వదిలి మహమ్మారి​పై యుద్ధానికి నడుం బిగించారు. వైరస్ కేసులు తగ్గుముఖం పట్టే సమయానికి పిడుగులాంటి వార్త వారి చెవిన పడింది. తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఏపీ శ్రీకాకుళం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వగా.. ఎటూపాలుపోని స్థితిలో ఉన్నారు. తమ సేవలను గుర్తించాలని ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.

తాత్కాలిక వైద్య సిబ్బంది సేవలకు స్వస్తి!

author img

By

Published : Oct 1, 2020, 10:38 PM IST

temporary-medical-staff-removing-at-ap-covid-care-centers-in-srikakulam
తాత్కాలిక వైద్య సిబ్బంది సేవలకు స్వస్తి!

'జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇక మీ సేవలు అవసరం లేదు. విధులను విడిచి వెళ్లిపోవచ్చు'- కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలివి. కొంత కాలం పనిచేస్తామని భావించిన సిబ్బంది.. ఈ మాటలతో ఆవేదనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి తమను వెళ్లిపోవాలని చెప్పగా..ఏపీ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న 'ఏపీ టిడ్కో కొవిడ్‌ కేర్‌' కేంద్రంలో స్టాఫ్‌ నర్సులంతా కొద్దిరోజులుగా ఆందోళన బాట పట్టారు.

కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తగిన స్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టింది. నిబంధనల ప్రకారం అర్హతలున్న వారిని జిల్లాస్థాయి అధికారులు ఎంపిక చేశారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆరోగ్య కార్యకర్తలు కలిపి 1176 మందిని విధుల్లోకి తీసుకున్నారు. మే నుంచి జులై వరకూ ఈ ప్రక్రియ సాగింది. రోజుకు వెయ్యి వరకు కొత్త కేసులు నమోదైనప్పుడు వీరి సేవలు రోగులకు ఉపయోగపడ్డాయి. తాజాగా జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో సిబ్బందిని తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు.

మాటే ముప్పు తెచ్చిందా:

మొదటి విడత ఉద్యోగుల నియామక ఉత్తర్వుల్లో 'తాత్కాలిక పద్ధతిన' అని పేర్కొన్నారు. ఎంత కాలమనే విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. తొలివిడత ఎంపికైన వారికి ఆరునెలలు, రెండోసారి వచ్చిన వారికి మూడు నెలలు పనిచేయాలంటూ నోటిమాటగా చెప్పారు. సిబ్బందికి ఇప్పుడదే శాపంగా మారింది. ముందుగా విధుల్లో చేరిన కొంతమందిని ఉంచి, ఆగస్టులో వచ్చిన వారిని మూడు నెలలు పూర్తి కాకుండానే వెళ్లిపోవాలని కొందరు నోడల్‌ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. వారంతా ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు.

జీతాల్లోనూ వ్యత్యాసం

స్టాఫ్‌ నర్సులకు మొదట్లో నెలకు రూ.34 వేలు చెల్లిస్తామని అధికారులు చెప్పారు. రెండోవిడత నియామకానికి వచ్చేసరికి రూ.24 వేలకు తగ్గించారు. ఇంకొన్ని పోస్టుల్లోనూ ఇలాగే జరిగింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి ఆరంభంలో ఇక్కడ కేసులు నమోదు కాలేదు. జూన్‌ తర్వాత నుంచే ఇక్కడ నియామకాలు జరిగాయి. నెల వ్యవధిలో ఎంపికైనా, పడిన కష్టం ఒక్కటే అయినా జీతాల్లో వ్యత్యాసం చూపారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

భవిష్యత్తుపై స్పష్టత లేదు:

తాత్కాలిక ఉద్యోగులు ఎవరికీ ఇప్పటి వరకూ జీతాలు ఇవ్వలేదు. ఇచ్చేవే అరకొర జీతాలు, వాటికీ 'బిల్లులు పెట్టాం.. బడ్జెట్ వచ్చాక చెల్లిస్తామంటూ' అధికారులు చెబుతున్నారు. తర్వాత వెలువడే ఉద్యోగ ప్రకటనల్లో ప్రాధాన్యం కల్పిస్తామని, మార్కుల్లో వెయిటేజీ ఇస్తామని కంటి తుడుపు మాటలు వల్లిస్తున్నారు. జీతాలు ఎప్పుడొస్తాయో, నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారో, ఎవరికి ఎంత వెయిటేజీ ఇస్తారో వంటి అంశాలపై స్పష్టత లేదు. ఉన్నట్టుండి వెళ్లిపోమని చెప్పడం వేదనకు గురిచేస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.

గౌరవం ఇదేనా?

"అన్ని అర్హతలూ ఉన్నాయనే విధుల్లోకి తీసుకున్నారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందించాం. మా పనికి కనీస గుర్తింపు లేకపోవడం బాధ కలిగిస్తోంది. ప్రభుత్వ కొలువు అని ఆనందంగా వచ్చాం. ఏ స్పష్టతా ఇవ్వకుండా ఉన్నట్టుండి వెళ్లిపోమని చెప్పడం తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది". - స్టాఫ్‌ నర్సు, ఏపీ టిడ్కో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌.

అందరినీ వదిలి సేవలు చేశాం

"కన్నవారిని వదిలి ప్రాణాలకు తెగించి అత్యవసర సమయంలో సేవలందించాం. మాలో కొందరు కొవిడ్‌ బారిన పడి, కోలుకుని మళ్లీ విధులకు హాజరయ్యాం. మా జీతాలు చెల్లించడమే భారమైపోయిందా? జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ఎన్నో ఖాళీలు ఉన్నాయి. వాటిని మాతో భర్తీ చేయాలి". - మరో స్టాఫ్‌ నర్సు.

కలెక్టర్‌ పరిశీలనలో ఉంది

"నర్సింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న వారిని ట్రైనింగ్‌ ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నాం. వారికి పరీక్షలున్న నేపథ్యంలో కేవలం 34 మందిని మాత్రమే వెళ్లమని చెప్పాం. మిగిలిన వారిలో ఒప్పంద సమయం ముగిసిన వారినీ వెళ్లిపోవాలని చెబుతున్నాం. రోగులు కూడా తగ్గిపోయారు. ఈ విషయమింకా పరిశీలనలో ఉంది. పూర్తిస్థాయి ఆదేశాలు కలెక్టర్‌ నుంచి రావాల్సి ఉంది. బడ్జెట్ వస్తే జీతాలు చెల్లిస్తాం". - ఎన్‌.అనురాధ, డీఎంహెచ్‌వో.

ఇదీ చదవండి: విద్యార్థుల ఇంటికి పూర్తిగా చేరని పౌష్టికాహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.