ETV Bharat / state

Solar eclipse: సూర్యగ్రహణంతో ప్రధాన ఆలయాల మూసివేత

Solar eclipse: సూర్యగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్​లో శ్రీకాళహస్తి మినహా అన్ని దేవాలయాలు మూతపడ్డాయి. తిరుమల ఆలయాన్ని ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7.30 తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతిస్తారు. సూర్యగ్రహణం కారణంగా తితిదే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.

TEMPLES
TEMPLES
author img

By

Published : Oct 25, 2022, 10:26 AM IST

Solar eclipse: ఇవాళ సూర్యగ్రహణం కారణంగా శ్రీకాళహస్తి మినహా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతించనున్నారు. అలాగే సూర్యగ్రహణం కారణంగా బ్రేక్‌ దర్శనాలను కూడా తితిదే రద్దు చేసింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు.

బుధవారం ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చన, మహానివేదన, హారతి నిర్వర్తించి మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. విశాఖ సింహాచలం ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అలాగే.. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని.. ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు మూసివేస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.