Temperatures dropped: రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావడంలేదు. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రి షెడ్లు లేకపోవడంతో పుట్ పాత్‌లపైనే నిద్రిస్తున్నారు. ఇలా పుట్ పాత్లపై పడుకునేవారు.. రగ్గులు కప్పుకున్నప్పటికీ చిగురుటాకులా వణికిపోతున్నారు. తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ప్రయాణ ప్రాంగణాల్లో ప్రయాణికులు చలికి వణికిపోతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో తెల్లవారుజామున 3గంటలకు ప్రయాణం చేయాల్సిన వారు ముందే వచ్చి రైల్వే స్టేషన్లలో పడుకుంటున్నారు. రాత్రిళ్లు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో అర్ధరాత్రి వరకే స్టేషన్లకు వచ్చి స్టేషన్లలోనే పడుకుంటున్నారు. దీంతో ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికులు రాత్రిళ్లు చలికి వణికిపోతున్నారు.
అత్యల్పంగా అర్లి(టీ)లో..
గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి (టీ)లో 7.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, వనపర్తి జిల్లాలోని కనైపల్లిలో 34.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వరంగల్‌లో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత, హనుమకొండలో 15.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 15.5డిగ్రీలు, నాగర్‌కర్నూల్‌లో 15.9 డిగ్రీలు, మహబూబాబాద్ లో 15.9 డిగ్రీలు, ఖమ్మంలో 16.5 డిగ్రీలు, సూర్యాపేటలో 16.6 డిగ్రీలు, నల్గొండలో 16.9 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇలా..
జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన 24 గంటల్లో బండ్లగూడలో అత్యల్పంగా 14.4 డిగ్రీల ఉష్ణోగ్రత, మోండామార్కెట్ పరిధిలో అత్యధికంగా 30.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజుల వరకు 14 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని.. అత్యధికంగా 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అల్వాల్‌లో 17 డిగ్రీలు, సరూర్‌నగర్‌లో 17.3 డిగ్రీలు, గాజులరామారంలో 17.4 డిగ్రీలు, ఎల్.బీ.నగర్లో 17.5 డిగ్రీలు, చందానగర్‌లో 17.5 డిగ్రీలు, చంద్రాయణగుట్టలో 17.6డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 17.8 డిగ్రీలు, కాప్రాలో 17.7డిగ్రీలు, బేగంపేట్‌లో 17.8 డిగ్రీలు, కూకట్‌పల్లిలో 17.8 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌లో 17.9 డిగ్రీలు, ముషీరాబాద్‌లో 17.9 డిగ్రీలు, జూబ్లీహిల్స్‌లో 17.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: