Low Temperatures in Hyderabad: ఉత్తర భారతంలోని హిమాలయాల నుంచి వస్తున్న శీతల గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగా ఉంటున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. సోమవారం రాత్రి పలు ప్రాంతాల్లో 8.3 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవడంతో చలి అధికంగా ఉంది. అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 8.3 డిగ్రీలుంది.
జీహెచ్‌ఎంసీ శివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్, కాలుష్యం వల్ల శివారుకన్నా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు పలు ప్రాంతాలను కమ్మేస్తోంది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రత కొంత పెరిగే సూచనలున్నట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
ఇవీ చదవండి: