రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. సూర్యుడి భగభగలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటం వల్ల జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల వరకు
జిల్లా | మండలం | ఉష్ణగ్రతలు( డిగ్రీలు) |
జగిత్యాల జిల్లా | ధర్మపురి | 47 |
మంచిర్యాల జిల్లా | జన్నారం | 46.9 |
నల్గొండ జిల్లా | హాలియా | 46.8 |
జయశంకర్ భూపాలపల్లి జిల్లా | మొగుళ్లుపల్లి | 46.4 |
పెద్దపల్లి జిల్లా | మంథని | 46.2 |
మహబూబ్నగర్ జిల్లా | బాలానగర్ | 46.1 |
నిర్మల్ జిల్లా | ఎల్లాపూర్ | 45.9 |
ఆదిలాబాద్ | 45.7 | |
కరీంనగర్ జిల్లా | చిగురుమామిడిపల్లి | 45.6 |
రాజన్న సిరిసిల్ల జిల్లా | నామాపూర్ | 45.6 |
రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం