ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM - telugu news

ఇప్పటివరకు ప్రధానవార్తలు

1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Jan 11, 2022, 12:57 PM IST

Updated : Jan 11, 2022, 1:14 PM IST

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘మహారాష్ట్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు’’ అని ఆర్జీవీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • కారులో వ్యక్తి మృతదేహం..

Dead Body Found in Car at Hanumakonda : హనుమకొండ చౌరస్తాలో కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చౌరస్తాలోని బార్ వద్ద కారు నుంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

  • పాలరాపుగుట్టపై కానరాని రాబందుల జాడ

vultures at Palarapugutta : తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా? దక్షిణ భారతంలో రెండోది, రాష్ట్రంలో ఏకైక స్థావరమైన ఆసిఫాబాద్‌ జిల్లా పాలరాపుగుట్టపై కనుమరుగు అయ్యాయా? వీటిని ఇక జూపార్క్‌లోనే చూడాల్సి ఉంటుందా? క్షేత్రస్థాయి పరిస్థితులు వీటికి అవుననే సమాధానమిస్తున్నాయి.

  • వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

koil alwar thirumanjanam at Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జరిగింది. వైకుంఠ ఏకాదశిని పుర‌స్కరించుకుని ఆలయాన్ని తితిదే శుద్ధి చేస్తోంది. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు భక్తులకు దర్శనం నిలిపివేశారు.

  • నిజామాబాద్​కు విజయవాడ పోలీసులు

Nizamabad Family Suicide Case : ఏపీలోని విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ కుటుంబం కేసులో విచారణ చేపట్టేందుకు పోలీసులు ఇవాళ నిజామాబాద్​కు రానున్నారు. వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే నలుగురు వడ్డీ వ్యాపారులపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్‌తో పాటు నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

  • మతిస్థిమితంలేని బాలికపై గ్యాంగ్​ రేప్​

Sexual assault cases: మానసిక స్థితి సరిగాలేని బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. మరో కేసులో పాఠశాలకు వెళ్తున్న బాలికను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటనలు కర్ణాటకలో వెలుగు చూశాయి.

  • ధోనీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా

Kohli about Dhoni advice: కెరీర్ ప్రారంభంలో ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. పంత్ విషయంలోనూ ఆ సలహా వర్తిస్తుందని చెప్పాడు.

  • గాయని లతా మంగేష్కర్​కు కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో రోజులు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

  • ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన తండ్రి

మహబూబాబాద్ మం. గడ్డిగూడెం తండాలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

  • లక్షణాలు లేకుంటే పరీక్ష అవసరం లేదు

Corona test guidelines: లక్షణాలు లేని వారు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్​ తెలిపింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది.

  • మరోసారి స్పందించిన ఆర్జీవీ

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘మహారాష్ట్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు’’ అని ఆర్జీవీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • కారులో వ్యక్తి మృతదేహం..

Dead Body Found in Car at Hanumakonda : హనుమకొండ చౌరస్తాలో కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చౌరస్తాలోని బార్ వద్ద కారు నుంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

  • పాలరాపుగుట్టపై కానరాని రాబందుల జాడ

vultures at Palarapugutta : తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా? దక్షిణ భారతంలో రెండోది, రాష్ట్రంలో ఏకైక స్థావరమైన ఆసిఫాబాద్‌ జిల్లా పాలరాపుగుట్టపై కనుమరుగు అయ్యాయా? వీటిని ఇక జూపార్క్‌లోనే చూడాల్సి ఉంటుందా? క్షేత్రస్థాయి పరిస్థితులు వీటికి అవుననే సమాధానమిస్తున్నాయి.

  • వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

koil alwar thirumanjanam at Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జరిగింది. వైకుంఠ ఏకాదశిని పుర‌స్కరించుకుని ఆలయాన్ని తితిదే శుద్ధి చేస్తోంది. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు భక్తులకు దర్శనం నిలిపివేశారు.

  • నిజామాబాద్​కు విజయవాడ పోలీసులు

Nizamabad Family Suicide Case : ఏపీలోని విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ కుటుంబం కేసులో విచారణ చేపట్టేందుకు పోలీసులు ఇవాళ నిజామాబాద్​కు రానున్నారు. వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే నలుగురు వడ్డీ వ్యాపారులపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్‌తో పాటు నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

  • మతిస్థిమితంలేని బాలికపై గ్యాంగ్​ రేప్​

Sexual assault cases: మానసిక స్థితి సరిగాలేని బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. మరో కేసులో పాఠశాలకు వెళ్తున్న బాలికను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటనలు కర్ణాటకలో వెలుగు చూశాయి.

  • ధోనీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా

Kohli about Dhoni advice: కెరీర్ ప్రారంభంలో ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. పంత్ విషయంలోనూ ఆ సలహా వర్తిస్తుందని చెప్పాడు.

  • గాయని లతా మంగేష్కర్​కు కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో రోజులు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

Last Updated : Jan 11, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.