ETV Bharat / state

నూతన సంవత్సర వేడుకలపై పబ్​లు.. మార్గదర్శకాలను పాటించాలి: హైకోర్టు

High court on Pubs: పబ్బుల్లో నూతన సంవత్సరం వేడుకల నిర్వహణకు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పబ్​లు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొంది. జూబ్లీహిల్స్‌లో నివాస ప్రాంతాల్లో పబ్బులను నియంత్రించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ మేరకు విచారణను వాయిదా వేసిన ధర్మాసనం.. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా పలు సూచనలు జారీ చేసింది.

ts high court
తెలంగాణ హైకోర్టు
author img

By

Published : Dec 30, 2021, 7:42 PM IST

High court on Pubs: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని పబ్‌లను హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్​లోని నివాస ప్రాంతాల్లో పబ్‌లను తొలగించాలన్న పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నివాస ప్రాంతాల్లో పబ్‌లు ఏర్పాటు చేసి.. పార్కింగ్‌ సమస్యలు సృష్టిస్తున్నారని.. విపరీతమైన శబ్ధకాలుష్యానికి కారకులవుతున్నారని స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్‌ శాఖను కూడా ఉన్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది.

ఏం చర్యలు తీసుకుంటున్నారు

జూబ్లీహిల్స్‌ నివాస ప్రాంతాల్లో ఉన్న పబ్‌ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యంతో పాటు ఇతర ఇబ్బందుల నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు సంవత్సరాంతపు, నయా సాల్‌ వేడుకలకే పరిమితం కాకుండా చూడాలంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. నివాస ప్రాంతాల్లో పబ్‌లుండటమే సరైన నిర్ణయంకాదని.. డిసెంబరు 31, జనవరి 1లను దృష్టిలో ఉంచుకుని ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ విచారణను జనవరి 6 కి వాయిదా వేశారు.

బాధ్యతగా వ్యవహరించాలి

New year guide lines: అనంతరం పబ్బులు, క్లబ్బులు, హోటళ్లలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై జారీచేసిన మార్గదర్శకాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్​ హైకోర్టుకు సమర్పించారు. మార్గదర్శకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. వాటిని పాటించాలని పబ్‌లను ఆదేశించింది. పబ్బుల్లో నూతన సంవత్సరం వేడుకల నిర్వహణకు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు గతంలో ఎన్నడూ లేనన్ని మార్గదర్శకాలను ఈ ఏడాది రూపొందించిందని సంతృప్తి వ్యక్తం చేసింది. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పబ్బులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మైనర్లను అనుమతించ వద్దని.. హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. మద్యం తాగిన తర్వాత వాహనాలు నడపకుండా నిరోధించాలని పబ్బులకు సూచించింది.

ఇదీ చదవండి: Covaxin on Children: పిల్లలపై కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలు: భారత్‌ బయోటెక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.