Jagdish reddy on electric vehicles: రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ వాహనాల సరఫరా లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే 136 ఈవీ స్టేషన్లను రెడ్కో ఏర్పాటు చేసిందని... మరో 600కిపైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అపోహలు ఉన్నాయన్న మంత్రి... వాటిని వీడాలని సూచించారు. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోలుకు ముందుకురావాలని కోరారు. సీఎం కేసీఆర్, తాను కూడా విద్యుత్ వాహనాలు వాడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎలక్ట్రిక్ వాహనాల అవగాహన సదస్సు పాల్గొన్న మంత్రికి ఈవీ కారును బీవైడీ సంస్థ ప్రతినిధులు బహుకరించారు.
మనం సృష్టించే పర్యావరణ ముప్పుతో మానవాళికి ఇబ్బందులు తలెత్తే అవకాశముందని మంత్రి అన్నారు. కాలుష్యాన్ని నిరోధించడానికి మనవంతు ప్రయత్నం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే హరితహారాన్ని ఒక ఉద్యమంలా చేపట్టినట్లు పేర్కొన్నారు. డీజిల్, పెట్రోల్ స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని... అందుకు అనేక ప్రోత్సాహకాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని ఆయన వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో డిమాండ్‌కు తగిన సరఫరా లేదు. ఏ వెహికిల్ బుక్ చేసినా నెలల సమయం పడుతోంది. చాలామందికి వీటిపై అనుమానాలు ఉన్నాయి. రిపేర్స్ వస్తే ఎలా?, ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి? వంటి భయాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి అన్ని సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. టీఎస్ రెడ్కో ద్వారా రాష్ట్రమంతటా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే 136 స్టేషన్లు పెట్టారు. మరో 600 స్టేషన్లను ఈ ఏడాదిలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టేట్, నేషనల్ హైవేల మీద వీటిని ఏర్పాటు చేస్తాం.
-జగదీశ్ రెడ్డి, మంత్రి
ఇదీ చదవండి: 20 years ago KTR Photo: 20 ఏళ్ల క్రితం ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. నెటిజన్లు ఏమన్నారంటే?