ETV Bharat / state

వడ్డీ వ్యాపారుల దోపిడీ.. రుణం పేరుతో విలువైన భూములు స్వాహా

Land Registration Under Mortgage: వ్యవసాయం చేద్దామంటే పెట్టుబడి అందక... బ్యాంకుల్లో అప్పులు పుట్టక.. రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వడ్డీ వ్యాపారులు... తాకట్టు కింద భూమిని రిజిస్ట్రేషన్​ చేయించుకుంటున్నారు. బాకీ చెల్లించినా... తిరిగి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

Interest traders
వడ్డీ వ్యాపారుల దోపిడీ.. రుణం పేరుతో విలువైన భూములు స్వాహా
author img

By

Published : Dec 29, 2021, 6:42 AM IST

Land Registration Under Mortgage: బ్యాంకుల్లో అప్పులు పుట్టక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న పేద రైతులు ఆస్తులను కోల్పోతున్న దృష్టాంతాలు వెలుగుచూస్తున్నాయి. తాకట్టు కింద ఏకంగా రైతుల భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తిరిగి కడితే వెనక్కి రిజిస్టర్‌ చేస్తామని ఒప్పంద పత్రాలు రాసిస్తున్నారు. తీరా డబ్బులు తిరిగి చెల్లిస్తున్నా.. ఆ సమయానికి భూముల విలువలు పెరుగుతున్నందున ఒప్పందాన్ని అమలు చేయడం లేదు. గట్టిగా నిలదీసి అడిగితే గ్రామ పెద్దల సమక్షంలో రాజీ ఒప్పందాలు చేసుకుని భూములను వ్యాపారులే సొంతం చేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. భూములు ఎలాగూ తమ పేరిట రిజిస్టర్‌ అయినందున స్వాధీనానికి తొందరేంలేదన్న ధోరణిలో వ్యాపారులు ఉంటున్నారు. ఇలా భూముల్ని కోల్పోతున్న ఎందరో బాధితులు రాష్ట్ర రుణ విమోచన కమిషన్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

భూముల విలువ పెరగడంతో

Farmers problems: కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడటంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూముల విలువలు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో ఓ వ్యాపారి రూ.10 లక్షల అప్పు ఇచ్చి 3.08 ఎకరాలను తాకట్టు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్‌ ధర రూ.50 లక్షలు దాటడంతో వెనక్కి ఇవ్వకుండా అధిక వడ్డీలు కట్టాలని వ్యాపారి సతాయిస్తున్నాడు. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలు. తమ భూములు వెనక్కి ఇస్తే వాటిలో కొంత అమ్మి అప్పు పూర్తిగా తీరుస్తామని రైతులు వేడుకుంటున్నా.. వ్యాపారులు ససేమిరా అంటున్నారు.

శంకరన్నకు ఎంత కష్టమొచ్చె..!

Interest traders: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఉప్పల్‌ గ్రామానికి చెందిన రైతు శంకరన్న ఐజకు చెందిన వ్యాపారులు మేదరి భాస్కర్‌, మల్ద కంఠయ్యల వద్ద 2016 జులై 21న రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. తాకట్టు కింద శంకరన్నకున్న 3 ఎకరాల పొలాన్ని వారిద్దరూ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వడ్డీతోసహా రెండేళ్లలో కడితేనే పొలాన్ని తిరిగి శంకరన్న పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. వడ్డీతో సహా రూ.15 లక్షలు కడతానని శంకరన్న ముందుకొచ్చినా వారు వెనక్కి రిజిస్ట్రేషన్‌ చేయలేదు. దీంతో ఆయన రుణ విమోచన కమిషన్‌ను ఆశ్రయించాడు. వ్యాపారులిద్దరినీ పిలిచి విచారించగా.. శంకరన్న చెప్పిందంతా నిజమేనని, రూ.15 లక్షలు కడితే భూమిని వెనక్కి రిజిస్ట్రేషన్‌ చేస్తామని అంగీకరించారు. గ్రామానికి వెళ్లాక మాత్రం రూ.19 లక్షలు కట్టాలని వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

రూ.5 లక్షల రుణానికి రూ.35 లక్షల విలువైన భూమి స్వాహా!

financiers fraud: నాగర్‌కర్నూల్‌ జిల్లా తోటపల్లికి చెందిన వ్యాపారి కంభం బాలగౌడ్‌ రైతు పి.సంతోష్‌కుమార్‌కు రూ.5 లక్షల అప్పు ఇచ్చాడు. నెలకు రూ.వందకు రూ.3 చొప్పున వడ్డీతో ఏడాదిలోగా తిరిగి కట్టాలని ఒప్పందపత్రం రాసుకున్నారు. తాకట్టు కింద సంతోష్‌కు చెందిన 2.32 ఎకరాల భూమిని బాలాగౌడ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అప్పు వడ్డీతో సహా రూ.13,38,774కి చేరిందని, అవసరమైతే మరో రూ.4 లక్షలు తీసుకుని భూమిని పూర్తిగా వదిలేయాలని సంతోష్‌ను బెదిరించాడు. ఇప్పుడు ఆ భూమి మార్కెట్‌ విలువ రూ.35 లక్షలుంది. చేసేదేంలేక ఆ రైతు రాష్ట్ర రుణ విమోచన కమిషన్‌ను ఆశ్రయించాడు.

రైతులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

'విచారణ సందర్భంగా వ్యాపారుల ఆగడాల గురించి వింటుంటే గుండె తరుక్కుపోతోంది. పేదలకు కొద్దిగా అప్పులిచ్చి అంతకన్నా పదిరెట్లు విలువైన భూములను వ్యాపారులు కొట్టేస్తున్నారు. ఇలాంటి వాటిపై రైతులు కమిషన్‌కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. అన్నదాతలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల నిర్లక్ష్యంపై ఆర్బీఐకి కమిషన్‌ తరఫున ఇటీవల లేఖ రాశాం. ప్రైవేటు అప్పులు తీర్చడానికి రైతులకు ఎన్ని రుణాలిచ్చారో లెక్కలు చెప్పాలని రాష్ట్ర బ్యాంకర్ల సమితిని ఆదేశించాం.'

- నాగుర్ల వెంకటేశ్వర్లు, ఛైర్మన్‌, పాకాల శ్రీహరిరావు, కవ్వా లక్ష్మారెడ్డి సభ్యులు, రాష్ట్ర రుణ విమోచన కమిషన్‌

...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.