Woman Hulchul in Bakery : హైదరాబాద్ మోతీనగర్‌లోని ఓ బేకరీలో మహిళ హల్‌చల్ చేసింది. బేకరీలో తినడానికి వచ్చిన ఆమె... పక్కన ఉన్న వారిపట్ల అనుచితంగా ప్రవర్తించింది. తాను తినేసిన పదార్థాలు పక్కనున్న వారిపై పడేసింది. అదే విధంగా బేకరీకి వచ్చిన వారిపట్ల కూడా దురుసుగా ప్రవర్తించింది.
బేకరిలో ఉన్న మిగతా వారితోనూ గొడవపడింది. దీంతో బేకరీ నిర్వాహకులతోపాటు స్థానికులు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులతోనూ ఆ మహిళ దురుసుగా ప్రవర్తించింది. ఎట్టకేలకు ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించారు. బేకరీలో హల్‌చల్ చేస్తున్న మహిళ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: Justice N. V. Ramana : 'ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక'