ETV Bharat / state

ముందస్తు ఎన్నికల సంకేతాలు.. నేతలు సిద్ధంగా ఉండాలన్న చంద్రబాబు - TDP latest news

TDP Strategy Committee Meeting: ఏపీలో తాజాగా నెలకొంటున్న పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ అధిష్ఠానం అభిప్రాయపడింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో ఆయన వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TDP
TDP
author img

By

Published : Feb 8, 2023, 9:54 PM IST

TDP Strategy Committee Meeting: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా చోటు చేటుకుంటున్న పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల వచ్చే వాతావరణం కనిపిస్తోందని టీడీపీ భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉండాలని వ్యూహ కమిటీ సమావేశంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. పలు కీలక విషయాలపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.

21 నుంచి సమావేశాలు షురూ: ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణుల్ని చైతన్యపరిచేందుకు ఈ నెల 21వ తేదీ నుంచి 5 రోజుల పాటు 5 జోన్లలో చంద్రబాబు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో తాజాగా నెలకొంటున్న పరిణామాలను చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు అనుగుణంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. మోయలేని అప్పుల భారం.. జీతాలు చెల్లించలేని దుస్థితి.. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి పాల్యెస్‌ వైపు చూపడం.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, ఎమ్మెల్యేల తిరుగుబాటులతో పాటు తదితర పరిణామాలు ముందస్తు ఎన్నికల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం వ్యూహ కమిటీ సమావేశం అభిప్రాయపడింది.

సీబీఐ కేసుల విచారణ వేగవంతంతోనే ముందస్తుకు: మార్చి తర్వాత కేంద్రం కొత్త అప్పులకు అంగీకారం తెలిపితే.. ఒకటి రెండు నెలలు గడిపి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ సభలకు వస్తున్న ప్రజాదరణకు వణికిపోయే.. ఓటమి భయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ ఎన్నికల్లోపు వివేకా హత్య కేసు నిందితులెవ్వరో తేలిపోతుందని.. ఆలోపే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

75 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధం: జగన్ మోహన్ రెడ్డిపై గతంలో ఉన్న సీబీఐ కేసుల విచారణ వేగవంతం కానుండటంతో ముందస్తుకు సిద్ధం అవుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.విశాఖ రాజధాని అజెండాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 75 మంది తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని.. నెల్లూరు జిల్లా ఓ ఉదాహరణ మాత్రమేనని తెలిపారు.

ఎమ్మెల్యేల తిరుగుబాటు ముదరక ముందే ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రానికి ఓ మూర్ఖుడు, సైకో, దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా 160 స్థానాల్లో తెలుగుదేశం విజయం ఖాయమని స్పష్టం చేశారు. మార్చిలో వచ్చే బడ్జెట్ వెసులుబాటు మూడు నెలలు ఉపయోగించుకుని తర్వాత చేతులెత్తేసే యోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు అన్నారు. నవంబర్‌లోపే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డిని సాగనంపుతాం: ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిని సాగనంపి, రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి కల్పిస్తామని పార్టీ నాయకులు తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో మల్చుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 5 రోజులపాటు చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశాల్లో పోల్ మేనేజ్​మెంట్​ అజెండాగా జరుగుతాయని వివరించారు. అంతర్గత కుమ్ములాటల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి: జాతీయ వాదం ముసుగులో ప్రధాని మోదీ దాక్కుంటున్నారు: కవిత

'UPA పాలనలో ఒక దశాబ్దం వృథా.. భారత్​ పరువు గంగపాలు'.. మోదీ తీవ్ర విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.