కోమోరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు ఒడిశా మీదుగా 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు.
వీటితో పాటు దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్రంలో ఐదు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.