Voter List Revision Program Telangana : శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections) కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా(Voters List) సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. రెండో విడత ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 21వ తేదీన ఓటర్ల జాబితా(Voter List Process in Telangana) ముసాయిదాను ప్రకటించారు.
Total Number of Voters in Telangana : ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్లా ఆరు లక్షల 26 వేల 996గా ఉంది. అందులో పురుషులు కోటి 53 లక్షల 73 వేల 66 మంది.. మహిళలు కోటి 52 లక్షల 51 వేల 797 మంది ఓటర్లు ఉన్నారు. 2,133 మంది ఇతరుల పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయి. ముసాయిదాపై ఆ రోజు నుంచి వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ముసాయిదా ప్రకటన వరకు అధికారుల వద్ద లక్షా 91 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్(Applications Pending)లో ఉన్నాయి. వాటిని కలిపితే ఇప్పటి వరకు మొత్తం 18 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్తగా ఓటుహక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తొమ్మిది లక్షలకు పైగా ఉంది.
Voter list Process in TS : మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన ఈసీ
Telangana Voter List 2023 : జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి మూడున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ఇక చిరునామా మార్పు, ఓటర్లు బదలాయింపు, సవరణలకు సంబంధించి ఐదున్నర లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వినతులు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.
Telangana Assembly Elections 2023 : వచ్చిన అన్ని దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ లోపు పరిష్కరించాల్సి ఉంది. ఆ తర్వాత సిద్ధమైన జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) అనుమతితో అక్టోబర్ నాలుగో తేదీన ఓటర్ల తుది జాబితా(Voters Final List)ను ప్రకటిస్తారు. ఆ ఓటరు జాబితా ప్రకారమే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకవేళ ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) వెలువడే వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పేర్లను అనుబంధ జాబితాలో ప్రకటిస్తారు.
వచ్చే నెలలో సీఈసీ పర్యటన..: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగవంతంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పనులను తొందరగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల మూడో తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas Raj) తెలిపారు. మూడు రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. అక్టోబర్ మూడో తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చించనుంది.
Telangana Voter List: ఓటర్ల లిస్ట్ రిలీజ్.. తెలంగాణలో ఎంతమంది ఉన్నారంటే?
Telangana Elections 2023 : ఎన్నికలకు బూత్ స్థాయి అధికారుల శిక్షణ షురూ