ETV Bharat / state

తెలంగాణ టార్గెట్​గా సైబర్ కేటుగాళ్ల దండయాత్ర - సైబర్​ నేరాల్లో తెలంగాణ మొదటి స్థానం

Cyber crimes in Telangana: దేశవ్యాప్తంగా నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో విడుదల చేసిన సైబర్​ నేరాల జాబితాలో తెలంగాణలో ముందు వరుసలో ఉంది. సైబర్‌నేరాల్లో మొదటి వరుసలో నిలిచే ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుండగా తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

cyber crimes
సైబర్​ నేరాలు
author img

By

Published : Feb 23, 2023, 12:09 PM IST

Cyber crimes in Telangana:దేశంలోని సైబర్​ నేరాల్లో ప్రతి ఏడాది మొదటి వరుసలో ఉండే ఉత్తరప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాల్లో.. దాడులు క్రమేపీ తగ్గుతున్నాయి. కానీ తక్కువ కేసులు ఉండే తెలంగాణలో మాత్రం గత మూడేళ్ల నుంచి కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ.. ఆర్థిక నేరాల్లో అగ్రస్థానంలో ఉందనే చెప్పవచ్చు. దీనికి గల ప్రధానమైన కారణం దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణపై హిందీ భాషను మాట్లాడే ఉత్తరాది ముఠాలు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఈ సైబర్​ నేరాలపై నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో, తెలంగాణ పోలీసులు గణాంకాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్​లో 2019లో 11,416.. 2020లో 11,097 సైబర్​ నేరాలు నమోదుకాగా.. 2021లో 8,829 కేసులకు తగ్గాయి. అదే కర్ణాటక విషయానికి వస్తే 2019లో 12,020 కేసులు రాగా.. 2020లో 10,741 కేసులు నమోదయ్యాయి. అయితే 2021లో ఆ సంఖ్య 8,136కు తగ్గాయని వారు వివరించారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే సైబర్​ నేరాల్లో.. 2019లో 2,691 కాగా, 2020లో 5,024 కేసులు నమోదయ్యాయి. 2021లో 10,303 కేసులు వచ్చాయి. ఒక్క ఏడాదిలోనే ఈ సైబర్​ నేరాల సంఖ్య 13,895కు చేరుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే రికార్డుగా ఉంది. ఈ పెరుగుదల ఎందుకు ఇలా విస్తరిస్తోందని.. పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏకంగా 4 సంవత్సరాలకే కేసులు సంఖ్య 11 రెట్లకు పైగా పెరగడంపై నేరాల తీవ్రతను అద్దం పట్టేలా చేస్తుంది. రాష్ట్రంలో సైబర్​ నేరాలు అధికంగా హైదరాబాద్​ నగరంలోనే జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక మూల సైబర్​ నేరం జరుగుతూనే ఉంది.

..

సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన ముఠాల వివరాలు ఇవే..

  • రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్​ నేరాల్లో.. ఆర్థికంగా కొల్లగొడుతున్న కేసులే అధికంగా ఉన్నాయి. ఎక్కువగా ఝార్ఖండ్​, దిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్​ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠా సభ్యులే ఎక్కువగా పంజా విసురుతున్నారు.
  • రాజస్థాన్​ కేంద్రంగా పనిచేస్తున్న ఆన్​లైన్​ ముఠా సంస్థ.. ఓఎల్​ఎక్స్​ వెబ్​సైట్​లో ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో పాత వస్తువుల క్రయ, విక్రయ లావాదేవీల పేరిట మోసాలకు పాల్పడుతోంది. ఆ రాష్ట్రంలోని భరత్​పూర్​ ప్రాంతానికి చెందిన ఆర్థిక నేరగాళ్లు ఈ నేరాల్లో ఆరితేరారు. సైబర్​ దాడుల్లో వీరు ప్రమాదకర ముఠాగా పేరుగాంచారు.
  • ఝార్ఖండ్​ రాష్ట్రానికి చెందిన జామ్​తారా ప్రాంతం.. ముఠా సైబర్​ నేరాల రాజధానిగా పేరు గడిచింది. వీరు ఇక్కడ బ్యాంక్​ అధికారులుగా ఫోన్​ చేస్తూ క్రెడిట్​/డెబిట్​ కార్డుల్ని అప్​డేట్​ చేస్తామంటూ ఓటీపీ మోసాలకు పాల్పడతారు. వీరూ కూడా చాలా ప్రమాదకరమైన ముఠా సభ్యులు. ఎలాంటి దాడులకైనా వెనుకడగు వేయరు.
  • విదేశాలైనా ఆఫ్రికాలోని నైజీరియా దేశస్థులు దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్​ వంటి మెట్రో నగరాల్లో మకాం వేస్తారు. వీరు తెలుగు రాష్ట్రాలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టి.. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లు ఎక్కువగా లాటరీ, మ్యాట్రిమోనీ, జాబ్​ మోసాలకు పాల్పడుతూ.. అధిక మొత్తంలో దోచుకుంటున్నారు.

1930కు ఫిర్యాదుతోనే ఉపశమనం: ఈ సైబర్​ నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి.. 1930 హెల్ఫ్​లైన్​ నంబర్​కు కాల్​ చేస్తే.. ఆర్థిక నేరాలు జరగకుండా ఉపశమనం కలుగుతుంది. సైబర్​ దాడి జరిగిన వెంటనే ఈ నంబర్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ సైబర్​ క్రైమ్​ హెల్ప్​లైన్​ నంబర్​ను తీసుకువచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.