ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @7AM - Top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana news
టాప్​టెన్​ న్యూస్​ @7AM
author img

By

Published : Feb 23, 2022, 6:59 AM IST

  • నేడు మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్‌ ఇవాళ జాతికి అంకింతం చేయనున్నారు. భారీ జలాశయంలోకి లాంఛనంగా నీటిని విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాసితుల త్యాగాల వల్లే మలన్నసాగర్‌ పూర్తైందని..... మంత్రి హరీశ్‌రావు పేర్కొనగా.. తెలంగాణ నీటిపారుదల రంగంలో ఇవాళ చరిత్రాత్మకమైన రోజని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు.

  • నాలుగో దశ పోలింగ్​కు 'యూపీ' సిద్ధం

UP polls: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌కు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు బుధవారం ఓటింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీ పార్లమెంటు స్థానం పరిధిలో గత ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈసారి భాజపా తరఫున పోటీలో ఉన్నారు. ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్‌ సింగ్‌ కమలం తరఫున బరిలో నిలిచారు.

  • తెరాస ఆధ్వర్యంలో ఉక్కు నిరసన దీక్ష

TRS protest for Bayyaram Steel Plant: బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం తెరాస పోరాటానికి సిద్ధమైంది. ఇవాళ బయ్యారంలో ఉక్కు నిరసన దీక్ష చేపట్టనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కవిత సహా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఉక్కుపరిశ్రమపై కేంద్ర వైఖరిని తెరాస నేతలు ఎండగట్టనున్నారు.

  • మేడారం జాతరలోని హుండీల లెక్కింపు

Medaram Jathara: మేడారం మహాజాతరలో వచ్చిన ఆదాయం లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. దాదాపు పది రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అటు మేడారంలో ఇవాళ తిరుగువారం పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • రష్యాలోని ప్రముఖ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు

Russia America Sanctions: రష్యాపై మరిన్ని ఆర్థికపరమైన ఆంక్షలను ప్రకటించింది అమెరికా. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలైన వెబ్, సైనిక బ్యాంక్​పై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. రష్యాను కబ్జాదారుగా పేర్కొన్నారు బైడెన్​.

  • ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి 242 మంది భారతీయులు

India ukraine news: ఉక్రెయిన్‌ నుంచి ఎయిర్​ఇండియా విమానం భారత్‌కు చేరుకుంది. 242 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిర్​ఇండియా విమానం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • చిక్కేది చిటికెడు దొరకనిది దోసెడు

foreign drugs: విదేశాల నుంచి భారీగా మత్తుపదార్థాలు దిగుమతి అవుతున్న సంఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రాన్ని మత్తు విముక్తం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి దిగుమతి రూపంలో పెనుసవాలు ఎదురవుతోంది. పైగా ఇప్పటి వరకూ కొకైన్‌ లాంటి ఖరీదైన మత్తుమందులు మాత్రమే దిగుమతి అయ్యేవని భావించేవారు. కాని మొట్టమొదటిసారి అమెరికా నుంచి గంజాయి దిగుమతి అయినట్లు నార్కొటిక్స్‌ కంట్రోల్‌బ్యూరో (ఎన్సీబీ) గుర్తించడంతో మత్తుమందుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

  • భారత్​లో 100 కోట్ల 'స్మార్ట్‌ ఫోన్‌' యూజర్లు

100 Crore Smart Phone users: 2026 కల్లా భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెలాయిట్‌ అనే సంస్థ అంచనా వేసింది.

  • లంకతో సిరీస్​.. భారత స్టార్​ పేసర్​ దూరం

Deepak Chahar Injury: వెస్టిండీస్​తో సిరీస్​తో సందర్భంగా గాయపడ్డ భారత బౌలర్​ దీపక్​ చాహర్​.. శ్రీలంకతో టీ-20 సిరీస్​కు దూరమయ్యాడు. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. అతడి స్థానంలో ఇప్పటివరకు వేరెవరి పేరును ప్రకటించలేదని తెలిపారు.

  • చిరంజీవితో సుకుమార్ సినిమా ఫిక్స్

ప్రముఖ నటుడు చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు దర్శకుడు సుకుమార్‌. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేయాలనే నా కల నిజమైంది. వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తా" అంటూ చిరంజీవితో దిగిన ఫొటోని షేర్‌ చేశారు. సుకుమార్‌ అనూహ్య ప్రకటనతో సినీ అభిమానులు సర్‌ప్రైజ్‌ ఫీలవుతున్నారు. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదే కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.