ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్​ 11AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana Top News
టాప్​న్యూస్​ 11AM
author img

By

Published : Aug 15, 2022, 10:59 AM IST

  • భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మోదీ పంచసూత్రాలు

స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకోసం దేశప్రజలకు ఐదు సూత్రాలు బోధించారు. వీటిపైనే వచ్చే 25 ఏళ్ల పాటు పనిచేయాలని పిలుపునిచ్చారు.

  • సరికొత్త దారిలో ప్రయాణించే సమయం ఆసన్నమైందన్న మోదీ

భారత గడ్డపై ఉన్న మట్టిలో శక్తి ఉందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం ముందుకెళ్లకుండా ఆగేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశం ఎవరికీ తలవంచదని, ముందుకు వెళ్తూనే ఉంటుందని నొక్కి చెప్పారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ.. అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశం ముందు ప్రస్తుతం అనేక సువర్ణ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవ సంకల్పంతో, కొత్త దారుల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  • విద్యార్థీ మువ్వన్నెల జెండా నీకేం చెబుతోంది

National Flag What Tell The Students నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా మెజార్టీ యువత ఉన్న మన దేశంలో.. ప్రతి ఒక్కరికీ ఆ త్రివర్ణ పతాకం చెప్పే జీవితపాఠాలు ఆవశ్యకం. ఇంతకీ విద్యార్థీ జెండా నీకేం చెబుతోంది.

  • కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే నేటి మన స్వాతంత్య్రం

Revanth Reddy independence day wishes రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం.. వీరుల త్యాగమే నేటి మన స్వాతంత్య్రం అని రేవంత్​రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకొని కొన్ని శక్తులు నేడు దేశాన్ని మత ప్రాతిపదికగా చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు.

  • వేడుకకు రానంటావా, వీడియోకాల్‌ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య

Committed Suicide ఓ వ్యక్తి తన భార్యపై అలిగి ఆమెతో వీడియోకాల్ మాట్లాడూతూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని బంధువుల ఇంట్లో జరిగే బోనాల పండుగకు ఆమె రానని చెప్పడమే అందుకు కారణం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది

  • దేశంలో స్థిరంగా కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే

Covid Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం 8 గంటల వరకు 14,917 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 32 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.27 శాతానికి పెరిగాయి.

  • జాతి వజ్రాలు జాగృత తేజాలు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరులు

azadi ka amrit mahotsav దేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో. జైలు జీవితాన్నీ సంతోషంగా అనుభవించిన ఉదాత్తులు ఎందరో. వారందరికీ దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ వేనవేల వందనాలు. అలాంటి వారిలో కొందరి గురించి క్లుప్తంగా స్మరించుకుందాం

  • నోబెల్​ను ముద్దాడిన శాంతి దూతలు, శాస్త్ర స్రష్టలు

శాస్త్ర సాంకేతిక, సాహిత్యాది రంగాల్లో అసమాన ప్రతిభ చూపి ప్రపంచ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా పది మంది భారతీయులు నోబెల్​ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వారిని ఓ సారి స్మరించుకుందాం

  • అది ద్రవిడ్​ క్రేజ్,​ నాలుగు వేల పులులకు దీటుగా

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్ టేలర్‌ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా తన జీవిత చరిత్ర 'బ్లాక్‌ అండ్ వైట్' పుస్తకం మార్కెట్లోకి విడుదలైంది. భారత టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ ఓనర్లలో ఒకరు తనను మొహంపై కొట్టాడని సంచలన విషయం బయటపెట్టిన టేలర్‌.. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో ఉన్న అనుబంధం గురించి వివరించాడు.

  • అలా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్న అనుపమ పరమేశ్వరన్​

Anupama parameswaran: "అవకాశం వచ్చింది కదాని ఏదొకటి చేసేయాలని తొందర నాకు లేదు. ఏం చేసినా మంచి కథలే చేయాలనుకుంటున్నా. గుర్తుండిపోయే పాత్రలే పోషించాలనుకుంటున్నా" అంది నటి అనుపమ పరమేశ్వరన్‌. ఆమె.. నిఖిల్‌ జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ2' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్​హిట్​ను అందుకుంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆమె కొన్ని ఆసక్తికర సంగతులను తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.