ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్@ 3PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana top news Today
Telangana top news Today
author img

By

Published : Jan 3, 2023, 2:59 PM IST

  • 27 మెట్రో స్టేషన్లలో సిబ్బంది ఆందోళన..

హైదరాబాద్​ నగరంలోని మెట్రో రైలు టికెట్‌ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగి తమ నిరసన తెలిపారు.

  • గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభం

గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో ప్రాజెక్టుల ఖర్చు పెరుగుతోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అన్నారు. హైడ్రాలజీ, పర్యావరణ అనుమతులు వచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు సరికాదని పేర్కొన్నారు.

  • గ్రూప్‌-2 పరీక్షకు ఇలా ప్రిపేర్ అవ్వండి..!

గ్రూప్‌-1 తర్వాత ఉద్యోగార్థులు ఎక్కువగా ఎదురుచూసే నోటిఫికేషన్‌ గ్రూప్‌-2. తాజాగా 783 ఉద్యోగాలతో గ్రూప్‌- 2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతోంది.

  • భావ ప్రకటనపై సుప్రీం కీలక తీర్పు..

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించలేమని స్పష్టం చేసింది. ఓ మంత్రి చేసే ప్రకటనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపాదించలేమని సుప్రీం కోర్టు తెలిపింది.

  • పంజాబ్ సరిహద్దులో పాక్ చొరబాటుదారుడు హతం

పంజాబ్‌లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు గుండా.. భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడిని భద్రతా దళాలు హతమార్చాయి.

  • ఎత్తైన యుద్ధక్షేత్రంలో దేశానికి రక్షణగా 'వీరనారి'..

సియాచిన్​లో పోస్టింగ్ సాధించిన తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ రికార్డుకెక్కారు. సియాచిన్​లోని కుమార్ పోస్టులో ఈ వీరనారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఫొటోలు విడుదల చేసింది.

  • పెరిగిన డిపాజిట్ రేట్లు..

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్‌బీఐ రెపోరేటును పెంచింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు డిపాజిట్‌ రేట్లను సైతం పెంచాయి. మరి చిన్న పొదుపు పథకాల్లో ఏవి మంచి రాబడినిస్తున్నాయో చూద్దాం..!

  • 'ప్రయోగాలకు సమయం లేదు!'..

ఆసియా కప్‌ సందర్భంగా శ్రీలంక చేతిలో ఓడిన భారత్‌ మరోసారి ఆ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఈ సిరీస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • మరో 'అన్​స్టాపబుల్'​ ట్విస్ట్.. పవన్ ఎపిసోడ్ ఇప్పుడే కాదంట..

అన్​స్టాపబుల్​ దూసుకెళ్తున్న్ ఎన్​బీకే షోలో పవన్​ కల్యాణ్​ ఎంట్రీ ఇచ్చారన్న వార్త తెలియగానే ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రభాస్​ ఎపిసోడ్​ తర్వాత మోస్ట్​ అవెయిటింగ్​ ఎపిసోడ్​గా పవన్​ ఎపిసోడ్​ నిలుస్తున్న సమయంలో ఆహా సంస్థ ఫ్యాన్స్​కు ఓ షాకింగ్​ న్యూస్​ ఇచ్చింది. అదేందంటే.

  • 'మహిళల ఎదుగుదల.. పతనానికే!'..

ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న సమంత సోమవారం తిరిగి సోషల్​ మీడియాలో సందడి చేసింది. తన ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సామ్​.. ఓ నెటిజన్​ చేసిన ట్రోల్​కు తనదైన శైలిలో స్ట్రాంగ్​ రిప్లై ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.