ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్ @9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News Today
Telangana Top News Today
author img

By

Published : Jan 2, 2023, 9:00 PM IST

  • బీఆర్‌ఎస్‌లో చేరిన ఏపీ నేతలు

AP Leaders joined in BRS: ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్​లో చేరారు. వీరికి సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో ఏపీకి చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి పార్థసారథి తదితరులు ఉన్నారు.

  • '8ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు'

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చిన తరవాత విలువైన పెట్టుబడులు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఐటీ సంస్థలు వస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కృషితో లక్షలాది మందికి ఉపాధి లభించిందని అన్నారు.

  • ' కేసీఆర్ బీహార్‌కు పారిపోవడం ఖాయం'

సీఎం కేసీఆర్​పై రేవంత్​రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు అధికారం తాత్కాలికమేనని.. ఎల్లకాలం ఇలా ఉండదని స్పష్టం చేశారు. బీహార్‌తో కేసీఆర్‌కు రక్త సంబంధం ఉందని.. అందుకే బీఆర్‌ఎస్‌ అని పెట్టుకున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు.

  • సిట్ మెమో కొట్టివేతకు హైకోర్టు సమర్థన

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ మెమోను కొట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీఎల్‌ సంతోష్, తుషార్, శ్రీనివాస్‌ను నిందితులుగా గతంలో సిట్‌ మెమో దాఖలు చేసింది. ముగ్గురిని నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

  • నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

దిల్లీ లిక్కర్ స్కాం కేసులోని నలుగురు నిందితులకు రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది. ఈడీ విజ్ఞుప్తి మేరకు.. నిందితులకు ఈనెల 7 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.

  • 'పెద్ద నోట్ల రద్దు సరైనదే'.. సుప్రీంకోర్టు తీర్పు

మోదీ సర్కారుకు ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్​బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందున.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ మేరకు తీర్పు వెలువరించింది.

  • ముఖ్యమంత్రుల ఇళ్ల సమీపంలో బాంబు

పంజాబ్, హరియాణా ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలకు సమీపంలో బాంబు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

  • జైలుపై ముష్కరుల దాడి 14 మంది మృతి

Mexico Prison Attack : మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.

  • మిషన్ 2024 టార్గెట్​​..

రేపు జరగబోయే భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్​ కోసం క్రికెట్​ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో ఏలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఆ వివరాలు..

  • రష్యాలోనూ 'తగ్గేదేలే'..

ఇటీవలే రష్యాలో విడుదలైన అల్లుఅర్జున్​ 'పుష్ప' అక్కడ కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకు ఎంత కలెక్ట్​ చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.