ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Dec 22, 2022, 1:04 PM IST

తెలంగాణ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభానికి తెర దింపడానికి ఏఐసీసీ ట్రబుల్​షూటర్ దిగ్విజయ్​ సింగ్​ను హైదరాబాద్​కు పంపింది. గాంధీ భవన్​లో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు. అంతకుముందే ఆయణ్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిశారు.

  • రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి.. బీజేపీ నేతలకు కేటీఆర్ ప్రశ్న

మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కాజీపేటకు ఇస్తానన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని నిలదీశారు. దీనిపై బీజేపీ ఎంపీలు లేదా కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

  • రూ. కోటి విలువ చేసే వజ్రాలు చోరి..

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో కోటి రూపాయలు విలువ చేసే వజ్రాలు, బంగారం ముడి సరుకు చోరికి గురైంది. బంగారు ఆభరణాలు తయారుచేసే పవన్​కుమార్​ మంగళవారం గుజరాత్​ నుంచి వజ్రాలు, బంగారం ముడి సరుకు తీసుకొచ్చి షాపులో భద్రపరచగా.. బుధవారం వచ్చి చూసేసరికి లాకర్​తో సహా వజ్రాలు చోరికి గురైనట్లు గుర్తించాడు.

  • మీ ఇంట్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయా?

మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం సర్వే అంటే ఇంట్లో ఉన్న వారి వివరాలు, లేకపోతే వారికి అందుతున్న సంక్షేమ వివరాలు సేకరించడం. ఇది సహజం, సర్వసాధారణం. కానీ ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ ప్రభుత్వ సర్వేలు మాత్రం ఇందుకు విరుద్ధం. ఎందుకంటారా.. ఇది చదవండి.. మీకే తెలుస్తుంది.

  • భారత్​-చైనా వివాదంపై చర్చకు విపక్షాల డిమాండ్​..

చైనాతో భారత్ సరిహద్దు సమస్యపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడం వల్ల లోక్​సభ గురువారం వాయిదా పడింది. మరోవైపు, రాజ్యసభలో కూడా భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు నిరాకరించినందుకు ప్రతిపక్షాలు సభను బహిష్కరించాయి.

  • కూతురికి పిల్లలు లేరని దారుణం.. 10 నెలల చిన్నారి కిడ్నాప్​..

తమ కుమార్తెకు పిల్లలు లేరని దారుణానికి పాల్పడ్డారు దంపతులు. 10 నెలల చిన్నారికి కిడ్నాప్ చేసి ఆమెకు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన చిన్నారి తల్లిని హత్య చేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది. మరోవైపు, పరీక్షల్లో పాస్ చెయ్యాలంటే తనకు లైంగికంగా సహకరించమని విద్యార్థినిని వేధించాడు ఓ ప్రొఫెసర్.

  • పీసీబీ ఛీప్​ రమీజ్​ రాజాపై వేటు..

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్​గా ఉన్న రమీజ్ రాజాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. కొత్త ఛైర్మన్​ను నియమించింది.

  • ఆ హీరోయిన్ నేను హాట్ పెయిర్​: యంగ్​ బ్యూటీపై బాలయ్య కామెంట్స్​

ఓ హీరోయిన్​పై కామెంట్స్​ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తాను ఆమె హాట్​ పెయిర్ అని చెప్పారు. ఆ సంగతులు..

  • తెలంగాణ సర్కార్​కు షాక్.. రూ.900 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ

తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్​ భారీ జరిమాన విధించింది. అనుమతుల్లేకుండా పాలుమారు, రాంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపడుతోందని ఈ జరిమాన వేసింది.

  • 'ఎమ్మెల్యేలకు ఎర కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు'

ఈడీ కార్యాలయంలో అభిషేక్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు, తనకూ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. పైలట్ రోహిత్ రెడ్డితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని తెలిపారు.

  • దిగ్విజయ్​ సింగ్​తో జీవన్​రెడ్డి భేటి

తెలంగాణ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభానికి తెర దింపడానికి ఏఐసీసీ ట్రబుల్​షూటర్ దిగ్విజయ్​ సింగ్​ను హైదరాబాద్​కు పంపింది. గాంధీ భవన్​లో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు. అంతకుముందే ఆయణ్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిశారు.

  • రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి.. బీజేపీ నేతలకు కేటీఆర్ ప్రశ్న

మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కాజీపేటకు ఇస్తానన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని నిలదీశారు. దీనిపై బీజేపీ ఎంపీలు లేదా కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

  • రూ. కోటి విలువ చేసే వజ్రాలు చోరి..

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో కోటి రూపాయలు విలువ చేసే వజ్రాలు, బంగారం ముడి సరుకు చోరికి గురైంది. బంగారు ఆభరణాలు తయారుచేసే పవన్​కుమార్​ మంగళవారం గుజరాత్​ నుంచి వజ్రాలు, బంగారం ముడి సరుకు తీసుకొచ్చి షాపులో భద్రపరచగా.. బుధవారం వచ్చి చూసేసరికి లాకర్​తో సహా వజ్రాలు చోరికి గురైనట్లు గుర్తించాడు.

  • మీ ఇంట్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయా?

మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం సర్వే అంటే ఇంట్లో ఉన్న వారి వివరాలు, లేకపోతే వారికి అందుతున్న సంక్షేమ వివరాలు సేకరించడం. ఇది సహజం, సర్వసాధారణం. కానీ ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ ప్రభుత్వ సర్వేలు మాత్రం ఇందుకు విరుద్ధం. ఎందుకంటారా.. ఇది చదవండి.. మీకే తెలుస్తుంది.

  • భారత్​-చైనా వివాదంపై చర్చకు విపక్షాల డిమాండ్​..

చైనాతో భారత్ సరిహద్దు సమస్యపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడం వల్ల లోక్​సభ గురువారం వాయిదా పడింది. మరోవైపు, రాజ్యసభలో కూడా భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు నిరాకరించినందుకు ప్రతిపక్షాలు సభను బహిష్కరించాయి.

  • కూతురికి పిల్లలు లేరని దారుణం.. 10 నెలల చిన్నారి కిడ్నాప్​..

తమ కుమార్తెకు పిల్లలు లేరని దారుణానికి పాల్పడ్డారు దంపతులు. 10 నెలల చిన్నారికి కిడ్నాప్ చేసి ఆమెకు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన చిన్నారి తల్లిని హత్య చేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది. మరోవైపు, పరీక్షల్లో పాస్ చెయ్యాలంటే తనకు లైంగికంగా సహకరించమని విద్యార్థినిని వేధించాడు ఓ ప్రొఫెసర్.

  • పీసీబీ ఛీప్​ రమీజ్​ రాజాపై వేటు..

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్​గా ఉన్న రమీజ్ రాజాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. కొత్త ఛైర్మన్​ను నియమించింది.

  • ఆ హీరోయిన్ నేను హాట్ పెయిర్​: యంగ్​ బ్యూటీపై బాలయ్య కామెంట్స్​

ఓ హీరోయిన్​పై కామెంట్స్​ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తాను ఆమె హాట్​ పెయిర్ అని చెప్పారు. ఆ సంగతులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.