ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Dec 22, 2022, 6:59 AM IST

  • టీ కాంగ్రెస్‌లో సంక్షోభం.. నేడు అసంతృప్త నేతలతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న ఏఐసీసీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌లో అసంతృప్తి నేతలతో దిగ్విజయ్‌సింగ్‌ చర్చించనున్నారు. పీసీసీ, సీఎల్పీ గ్రూపుల నాయకులను సమన్వయం చేసి ఏకతాటిపై నడిచేలా చేయనున్నారు.

  • 'వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలు తిరిగిరావాలని ఆహ్వానిస్తున్నా'

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్రియాశీలకంగా చేయాలని తాను కోరుతున్నానన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని ఖమ్మం సభలో చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

  • 'త్వరలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో సమావేశం'

అన్ని మతాలను సమానంగా చూడటంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో సమావేశమవుతానని స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా.. క్రీస్తు బోధనలు అనుసరణీయమని వ్యాఖ్యానించారు. సంతోషకర సమాజం కోసం క్రీస్తుతో పాటు మరెందరో మహానుభావులు కృషి చేశారన్న ముఖ్యమంత్రి.. క్రీస్తు బోధనలు అందరూ పాటించి సంతోషకర జీవితాన్ని గడపాలని సూచించారు.

  • 'పౌష్టికాహార కిట్‌తో తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా'

విపక్షాలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ విద్వేష రాజకీయాలు చేస్తున్నాయని, మంత్రి హరీశ్​రావు విమర్శించారు. తల్లి, పిల్లల ఆరోగ్యం కోసం కేసీఆర్‌ ఆలోచిస్తుంటే, జనం మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష నేతలు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని మంత్రి హరీశ్​రావు కామారెడ్డిలో శ్రీకారం చుట్టగా, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

  • జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడి కార్యాలయంలో సీబీఐ సోదాల కలకలం

జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు.. చవ్వా గోపాల్ రెడ్డి కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగుళూరు నుంచి వచ్చిన ఆరుగురు సీబీఐ అధికారుల బృందం బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు గోపాల్ రెడ్డి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

  • దేశంలో కొత్త కరోనా వేరియంట్.. వాటికంటే డేంజర్..

చైనాలో కరోనా కేసుల సునామీకి కారణమైన ఒమిక్రాన్‌ ఉపరకం కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 దేశంలోనూ బయటపడింది. ఇప్పటివరకు 4 కేసులు నమోదుకాగా అందులో 3 గుజరాత్‌లోనే బయటపడినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్‌కు రీ-ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

  • 'చైనా తరహాలో దాడి చేస్తే భారత సైన్యంలా తరిమికొడతాం'..

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై శివసేన(ఠాక్రే) ఎంపీ, కర్ణాటక సీఎం వాగ్బాణాలు సంధించుకున్నారు. చైనా తరహాలో కర్ణాటకలోకి చొచ్చుకెళ్తామంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించగా.. తాము భారత సైన్యంలా తరిమికొడతామంటూ కర్ణాటక సీఎం బదులిచ్చారు.

  • ఉక్రెయిన్​కు అండగా అమెరికా.. 'పేక్రియాట్'​వ్యవస్థను ఇచ్చేందుకు రెడీ.. రష్యా ఆగ్రహం

ఉక్రెయిన్​కు మరోసారి అమెరికా అండగా నిలిచింది. కీవ్​కు 'పేట్రియాట్‌' రక్షణ వ్యవస్థను ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  • 'మార్టినెజ్‌.. ఇదేం పని?'.. ఎంబాపె ముఖం ఫొటో తగిలించిన పిల్లాడి బొమ్మను..

ఫిఫా వరల్డ్​ కప్​ 2022 ఫైనల్​లో సూపర్​ గోల్స్​తో అర్జెంటీనా హీరోగా మారిన ఎమిలియానో మార్టినెజ్‌ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయ యాత్రలో భాగంగా తలకు ఎంబాపె ముఖం ఫొటో తగిలించిన చిన్న పిల్లాడి బొమ్మను అతను పట్టుకుని బస్సుపై కనిపించాడు.

  • 'ఓ వైపు MBBS.. మరో వైపు సినిమాలు.. రవితేజకి నేను బిగ్​ ఫ్యాన్'

కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన 'పెళ్లిసందడి'తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. తన రెండో చిత్రంలోనే రవితేజతో జట్టు కట్టింది. 'ధమాకా' పేరుతో రూపొందిన ఆ చిత్ర శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆమె ముచ్చటించిన విశేషాలు మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.