ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - Telangana Top News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS
author img

By

Published : Dec 15, 2022, 7:00 AM IST

  • నేటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ముగియనుంది. గత నెల 28న నిర్మల్‌ జిల్లా భైంసాలో ప్రారంభమైన యాత్ర.. కరీంనగర్‌లో ముగియనుంది. యాత్ర ముగింపు వేళ బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

  • డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. నవీన్​రెడ్డి సహా ఆరుగురికి 14 రోజుల రిమాండ్‌

Manneguda Kidnapping Case updates: హైదరాబాద్‌లో సంచలనంరేకెత్తించిన దంత వైద్యవిద్యార్థిని అపహరణ కేసులో ప్రధాననిందితుడు నవీన్‌ రెడ్డి సహా ఆరుగురు నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. సురక్షితంగా లేనని.. కోర్టులో నవీన్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను గంటనిడివి ఉన్న వీడియోను విడుదల చేస్తే.. పోలీసులు మీడియాకి చేరకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు. కస్టడీకి ఇవ్వాలంటూ నేడు కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

  • దక్షిణాది విడిది కోసం తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

President Draupadi Murmu Will Come to The State: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న దక్షిణాది విడిది కోసం రాష్ట్రానికి రానున్నారు. 26వ తేదీ నుంచి 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లు దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి రాలేదు. రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన ద్రౌపది ముర్ము తొలిసారి దక్షిణాది విడిదికి వస్తున్నారు.

  • రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు..

Forest officer Srinivas murder case: రాష్ట్రంలో త్రీవ విషాదాన్ని నింపిన అటవీ అధికారి శ్రీనివాస్​ హత్య కేసులో ఇంత వరకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం న్యాయ సలహాదారు అమికస్‌ క్యూరీ దాఖలు చేసిన పిటిషన్‌కు మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

  • ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచి విడుదల..

MLC Anantha Babu Released From Jail: ఎమ్మెల్సీ అనంత బాబుకు రాజమహేంద్రవరంలోని ఫ్యామిలీ కోర్టు బెయిల్​కు షరతులు విధించింది. ప్రతీ వాయిదాకు కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో పాటు పాస్ పోర్ట్ సమర్పించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదని స్పష్టం చేసింది. కోర్టు బెయిల్​ ఇవ్వడంతో 211 రోజుల తర్వాత అనంతబాబు జైలు నుంచి విడుదలయ్యాడు.

  • చైనా దురాక్రమణపై విపక్షాల ఉమ్మడి పోరు..

భారత్ సరిహద్దులో చైనా దురాక్రమణ విషయంలో కేంద్రంపై సమష్టిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో 17 పార్టీలకు చెందిన నేతలు భేటీ అయి.. ఈ మేరకు చర్చలు జరిపాయి. కాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

  • రూ.4 కోట్ల బీమా కోసం ఫ్రెండ్​ మర్డర్​..

స్నేహితుడి పేరుపై ఉన్న రూ.4 కోట్ల బీమాను కాజేయడానికి అతన్ని హత్య చేశారు. అనంతరం దాన్ని యాక్సిడెంట్​గా చిత్రీకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణం మహారాష్ట్రలో వెలుగుచూసింది. మరో ఘటనలో ఓ వ్యక్తి రూ. 60 లక్షల అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని యువకుడిని హతమార్చాడు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

  • 'ఉగ్రదాడులు చేస్తూ.. సంబరాలా?'..

ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్, చైనాలకు పరోక్షంగా చురకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై అభ్యంతరం తెలిపారు.

  • సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫైనల్‌కు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

FIFA World Cup 2022 :సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో ఫ్రాన్స్‌ 2-0 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో.. ఈ మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది.

  • టాప్​-50 ఏషియన్​ సెలబ్రిటీల జాబితాలో.. తారక్, చరణ్​​ ఫస్ట్​ ప్లేస్..

యూకేలో ప్రతి సంవత్సరం విడుదల చేసే టాప్​-50 ఆసియన్​ సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్​ స్టార్స్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్ అగ్ర స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరు నిలిచారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.